English | Telugu

మెగాస్టార్ నిర్ణయాన్ని సమర్థిస్తారా...?

మెగాస్టార్ నిర్ణయాన్ని సమర్థిస్తారా...? విషయమేమిటంటే గత ముప్పై యేళ్ళుగా ఆంధ్రాప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. సినిమాల్లో ఆయన డ్యాన్స్ లు చూసి ఈలలు వేశారు. ఆయన ఫైట్స్ చూసి చప్పట్లు కొట్టారు. ఆయన డైలాగులకు జయహో అని జయజయ ధ్వానాలు చేశారు. అటువంటి చిరంజీవి ఒక్కసారిగా రాజకీయాల్లోకి వెళ్ళగానే ఆయన్ని అభిమానించే మెగాభిమానులకు సినిమాలు చూడాలన్న ఆసక్తి సన్నగిల్లింది.

కానీ ఆయన కొడుకు రామ్ చరణ్ తేజ హీరోగా సినీ రంగ ప్రవేశం చేయటంతో, మెగాభిమానులకు కొంత ఉపశమనం కలిగింది. కానీ అన్నయ్య 150 వ సినిమా చూడాలనుకునే అభిమానులందరికీ ఇటీవల చిరంజీవి చేసిన ప్రకటన శరాఘాతమలా తగిలింది. మరి "ఇకపై సినిమాల్లో నేను నటించను" అన్న మీరు ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తారా...? లేక చిరంజీవి మళ్ళీ సినిమాల్లోకి రావాలనుకుంటున్నారా...? మీ అభిప్రాయం మాకు తెలియజేయండి.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.