English | Telugu

4 కోట్లు వెనక్కి.. తేడా వస్తే ఇలానే ఉంటది 

సందీప్ కిషన్(Sundeep Kishan),రావు రమేష్ తండ్రి కొడుకులుగా స్క్రీన్ పై నవ్వులు పూయించిన చిత్రం 'మజాకా'. హిట్ చిత్రాల దర్శకుడు 'త్రినాథరావు నక్కిన' మరోమారు తన కమర్షియల్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. తొలి రోజు హిట్ టాక్ ని తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత కలెక్షన్స్ ని రాబట్టలేకపోవడంతో పరాజయాన్ని అందుకుంది. రాంగ్ టైంలో రిలీజ్ అయ్యిందనే మాటలు సినీ సర్కిల్స్ లో వినిపించాయి. హాస్య క్రియేషన్స్ పై రాజేష్ దండ నిర్మించగా, మరో నిర్మాత అనిల్ సుంకర సమర్పకుడిగా వ్యవహరించాడు.

ఇక ఈ చిత్రాన్ని రిలీజ్ చేసిన బయ్యర్లు భారీనష్టాలని చవి చూసారని, దీంతో 'రాజేష్ దండ' సుమారు నాలుగు కోట్ల రూపాయలని బయ్యర్లకి తిరిగి ఇచ్చేసాడనే వార్త సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం చాలా మంది బయ్యర్లు, సినిమా రిజల్ట్ తేడా కొడితే కొంత అమౌంట్ వెనక్కి ఇచ్చేలా, రిలీజ్ కి ముందే నిర్మాతతో ఒప్పందం చేసుకుంటున్నారు. ఆ ఒప్పందంలో భాగంగానే రాజేష్ దండ 4 కోట్లు ఇచ్చాడని అంటున్నారు. సందీప్ కిషన్ సరసన రీతూవర్మ(Ritu Varma)జంటగా నటించగా, రావు రమేష్ కి జంటగా అన్షు నటించింది. కొడుకు తన పెళ్లి కోసం, తండ్రికి మళ్ళీ ఎలా పెళ్లి చేసాడు. ఈ సందర్భంగా వాళ్లిదరు ఎదుర్కున్న ఇబ్బందులు ఏంటనేదే ఈ చిత్ర కథ. ఫిబ్రవరి 26 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజేష్ దండ ప్రస్తుతం కిరణ్ అబ్బవరం తో 'కె రాంప్'(K Ramp)అనే మూవీ చేస్తున్నాడు. అక్టోబర్ 18 న ఈ చిత్రం విడుదల కానుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.