English | Telugu

ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం 'నేనెవరు' : రాజేంద్ర ప్రసాద్

ఇటీవల కాలంలో చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న నటకిరీటి డా: రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్ర పోషించిన "నేనెవరు?" చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, దసరా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఆడియో మరియు టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ మాజీ మేయర్, మాజీ శాసనసభ్యులు, ప్రముఖ విద్యావేత్త తీగల కృష్ణారెడ్డి, ప్రముఖ దర్శకులు వి.సముద్ర ముఖ్య అతిధులుగా హాజరైన ఈ వేడుకలో రాజేంద్రప్రసాద్ పాల్గొని, ఈ చిత్రంలో నటించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసి, దర్శకుడిగా చిరంజీవికి ఉజ్వల భవిష్యత్ ఉందని పేర్కొన్నారు.

"నేను నటించిన మంచి సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయే చిత్రం "నేనెవరు?". దర్శకుడు చిరంజీవి ఈ కథ నాకు చెప్పినప్పుడు లిటరల్ గా షాక్ అయ్యాను. ఇంత గొప్ప కథను కరెక్ట్ గా తెరకెక్కించగలడా అని సందేహపడ్డాను కూడా. కానీ షూటింగ్ కి వెళ్ళాక కానీ... అతను ఎంత జీనియస్ అన్నది అర్ధం కాలేదు. నిర్మాతలు కూడా ఎంతో తపన, నిబద్ధత కలిగిన వ్యక్తులు. వాళ్ళకు "నేనెవరు?" చిత్రంతో ఘన విజయం సొంతం కావాలి" అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

"నువ్వేకావాలి, ప్రేమించు" వంటి సూపర్ హిట్ ఫిల్మ్స్ ఫేమ్ సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్యపాత్రల్లో చిరంజీవి తన్నీరు దర్శకత్వంలో సందేశభరిత వినోదాత్మకంగా "నేనెవరు?" చిత్రం తెరకెక్కింది. సరికొండ మల్లిఖార్జున్ సమర్పణలో జై చిరంజీవ మూవీ మేకర్స్ పతాకంపై అండేకర్ జగదీష్ బాబు - సకినాన భూలక్ష్మి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంతో వైజాగ్ సత్యానంద్ శిష్యులు అభిలాష్, సాయిచెర్రి హీరోలుగా పరిచయమవుతున్నారు. దీపిక - సోనాక్షి జబర్దస్త్ రాజమౌళి ఇతర పాత్రలు పోషించారు. రాజేంద్రప్రసాద్ వంటి లెజెండరీ ఆర్టిస్టుతో "నేనెవరు?" చిత్రం రూపొందించే అవకాశం లభించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని దర్శకనిర్మాతలు అన్నారు. దసరా కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఇంత గొప్ప చిత్రంలో పార్ట్ అవ్వడం గర్వంగా ఉందని నటీనటులు, యూనిట్ సభ్యులు అన్నారు.

చిన్నికృష్ణ సంగీతం అందిస్తున్న "నేనెవరు?" చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా నాయుడు ప్రసాద్ కొల్లి, ఎడిటర్స్ గా నందమూరి హరి, తారకరామారావు వ్యవహరిస్తున్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం