English | Telugu

ప్ర‌భాస్ ఫ్యాన్స్ హ‌ర్ట‌య్యారు మారుతీ...!

వేదిక‌లపై, అదీ.. మీడియా స‌మ‌క్షంలో ఉన్న‌ప్పుడు ఆచి తూచి మాట్లాడాలి. ఏమాట ఎక్కువైనా త‌క్కువైనా తిరిగి తీసుకోలేం. ఈ విష‌యం పాపం ద‌ర్శ‌కుడు మారుతికి అర్థం కాలేదేమో..?? పొర‌పాటున నోరు జారి, ఆ త‌ర‌వాత తీరిగ్గా నాలుక క‌ర‌చుకొంటున్నాడు. నోరు జారిన ఫ‌లితంగా ప్ర‌భాస్ ఫ్యాన్స్ హ‌ర్ట‌య్యారు.. గట్టిగా రియాక్ట‌ర‌య్యారు! ఇంత‌కీ విష‌యం ఏమిటంటే... ఇటీవ‌ల హైద‌రాబాద్‌లోని శిల్ప‌క‌ళావేదిక‌లో చ‌క్కిలిగింత ఆడియో కార్య‌క్ర‌మం వైభ‌వంగా జ‌రిగింది. ముఖ్య అతిథిగా ప్ర‌భాస్ విచ్చేశాడు. ప్ర‌భాస్ ఫాలోయింగ్ తెలియంది కాదు. ప్ర‌భాస్‌ని చూడ‌గానే ఫ్యాన్స్ గోల గోల చేశారు. ప్ర‌భాస్‌... ప్ర‌భాస్ అంటూ.. గ‌ట్టిగా అర‌చి త‌మ అభిమానాన్ని చాటుకొన్నారు. ఈత‌తంగం అంతా మారుతికి మ‌రోలా అనిపించింది. అదే వేదిక‌పై ఉన్న మారుతి ''ఇక్క‌డ ప్ర‌భాస్ బెల్ట్ వాళ్లు ఎక్కువ‌గా ఉన్న‌ట్టున్నారు..'' అన్నాడ‌ట‌. బెల్ట్ అంటే.. కులాన్ని, వ‌ర్గాన్ని ఉద్దేశించి అనే మాట‌. దాంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ తీవ్రంగా హ‌ర్ట‌య్యారు. ''మారుతి ఏంటి? మా గురించి ఇలా మాట్లాడేశాడు'' అని అక్క‌డున్న‌వాళ్లంతా ఆశ్చ‌ర్య‌పోయారు. ప్ర‌భాస్ కూడా మారుతి మాట‌ల‌కు షాకైపోయాడ‌ట‌. మొత్తానికి మారుతి నోరు జారాడు..! ఫ్యాన్స్ హ‌ర్ట‌య్యారు. ఇక ముందైనా మారుతి ఇలాంటి విష‌యాలు కెల‌క్క‌పోతేనే మంచిది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.