English | Telugu
ఆరు రోజుల్లో రూ. 60 కోట్లు.. 'మార్క్ ఆంటోని' బాక్సాఫీస్ హవా!
Updated : Sep 21, 2023
వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకొచ్చిన 'మార్క్ ఆంటోని' మూవీ.. బాక్సాఫీస్ ముంగిట వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. విశాల్ కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంది కూడా. కాగా, ఇప్పటివరకు ఆరు రోజుల ప్రదర్శన పూర్తిచేసుకున్న 'మార్క్ ఆంటోని'.. వరల్డ్ వైడ్ గా ఈ 6 రోజుల్లో రూ. 62. 75 కోట్ల గ్రాస్ ఆర్జించింది. మరి.. ఫుల్ రన్ లో ఈ సినిమా ఏ స్థాయిలో వసూళ్ళు రాబడుతుందో చూడాలి.
ఏరియాల వారిగా 'మార్క్ ఆంటోని' 6 రోజుల కలెక్షన్స్:
తమిళనాడు: రూ. 38.20 కోట్ల గ్రాస్
తెలుగు రాష్ట్రాలు: రూ. 6.50 కోట్ల గ్రాస్
కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా: రూ. 6.20 కోట్ల గ్రాస్
ఓవర్సీస్: రూ. 11.85 కోట్ల గ్రాస్
వరల్డ్ వైడ్ 6 రోజుల కలెక్షన్స్: రూ. 62. 75 కోట్ల గ్రాస్ (రూ. 30. 55 కోట్ల షేర్)