English | Telugu

నరేష్-పవిత్ర 'మళ్లీ పెళ్లి'కి ఊహించని షాక్!

నరేష్, పవిత్ర లోకేష్ జంటగా ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'మళ్లీ పెళ్లి'. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా రేపు(మే 26) ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదలకు కొద్ది గంటల ముందు ఈ మూవీ టీంకి ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమా విడుదలను ఆపాలంటూ నరేష్ మాజీ భార్య ర‌మ్య ర‌ఘుప‌తి కోర్టుని ఆశ్రయించారు.

'మళ్లీ పెళ్లి' సినిమా టీజర్, ట్రైలర్ విడుదలైనప్పుడే ఇది నరేష్-పవిత్ర ల బయోపిక్ లా ఉందనే కామెంట్స్ వినిపించాయి. నరేష్-పవిత్ర ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడటం, వారిద్దరూ ఓ హోటల్ లో ఉండగా రమ్య అక్కడకు వెళ్లి గొడవ చేయడం వంటి సన్నివేశాలతో పాటు టీజర్, ట్రైలర్ లో కృష్ణ, విజయనిర్మల రిఫరెన్స్ లు కూడా కనిపించాయి. ఈ సినిమా ప్రధానంగా నరేష్, పవిత్ర, రమ్య నిజజీవిత పాత్రల ఆధారంగా తెరకెక్కిన సినిమా అని ట్రైలర్ తో దాదాపు అందరికి క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలోనే తాజాగా రమ్య హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. త‌న ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించేలా ఈ సినిమాను చిత్రీక‌రించార‌ని, కావున విడుదలను ఆపాలంటూ ఆమె పిటిషన్ వేశారు. మరి దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.