English | Telugu

మహేష్ సినిమాకి టైటిల్‌ నిర్ణయించలేదు

సూపర్‌స్టార్‌ మహేష్‌ కథానాయకుడిగా మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై ‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వంలో ఎర్నేని నవీన్‌, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.మోహన్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ అక్టోబర్‌ 9 నుంచి హైదరాబాద్‌లో జరుగుతుంది.

టైటిల్‌ ఇంకా నిర్ణయించలేదు:

నిర్మాతలు ఎర్నేని నవీన్‌, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.మోహన్‌ మాట్లాడుతూ ` ‘‘మా మైత్రి మూవీ మేకర్స్‌ బేనర్‌లో సూపర్‌స్టార్‌ మహేష్‌గారితో చేస్తున్న తొలి చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ అక్టోబర్‌ 9న ప్రారంభమవుతుంది. మీడియాలో ఈ చిత్రానికి సంబంధించి కొన్ని టైటిల్స్‌ వినిపిస్తున్నాయి. కానీ, ఇంతవరకు ఈ చిత్రానికి టైటిల్‌ నిర్ణయించలేదు. టైటిల్‌ నిర్ణయించిన తర్వాత అఫీషియల్‌గా మేమే ఎనౌన్స్‌ చేస్తాము. మా బేనర్‌లో తొలి చిత్రమే సూపర్‌స్టార్‌ మహేష్‌గారితో చెయ్యడం మా అదృష్టం. మాకు ఇచ్చిన ఈ అపూర్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎంతో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్‌ చేశాం. సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుగారి అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించేలా ఈ చిత్రం వుంటుంది’’ అన్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌, శృతిహాసన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, జగపతిబాబు, బ్రహ్మానందం, ముఖేష్‌ రుషి, సంపత్‌, సుబ్బరాజు, తులసి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, సినిమాటోగ్రఫీ: మధి, థ్రిల్స్‌: అనల్‌ అరసు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, మేకప్‌: పట్టాభి, కాస్ట్యూమ్స్‌: రాజు, స్టిల్స్‌: దాసు, ఛీఫ్‌ కో`డైరెక్టర్‌: పి.వి.వి.సోమరాజు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: కె.వి.వి.బాలసుబ్రహ్మణ్యం, ప్రొడక్షన్‌ మేనేజర్‌ బి.వి.రామిరెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: అశోక్‌కుమార్‌రాజు ఎం., చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: ఎర్నేని నవీన్‌, యలమంచిలి, రవిశంకర్‌, సి.వి.మోహన్‌, కథ`స్క్రీన్‌ప్లే`మాటలు`దర్శకత్వం: కొరటాల శివ.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.