English | Telugu

తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో "బిజినెస్ మ్యాన్"

ప్రిన్స్ మహేష్ బాబు తెలుగుతో పాటు తమిళ, మళయాళ సిని పరిశ్రమల మీద కూడా కన్నేశాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తను హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న"ది బిజినెస్ మ్యాన్" చిత్రాన్ని తమిళ, మళయాళ భాషల్లో కూడా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. "ది బిజినెస్ మ్యాన్" చిత్రం 2012 జనవరి 11 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అత్యథిక ప్రింట్లతో విడుదల కానుంది.

"ది బిజినెస్ మ్యాన్" చిత్రంతోనే బాలీవుడ్ లోకి కూడా ప్రవేశించాలని ప్రిన్స్ మహేష్ బాబు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ "ది బిజినెస్ మ్యాన్" చిత్రంలో మహేష్ బాబు ఒక పాట కూడా పాడినట్లు తెలిసింది. ఇది "వై దిస్ కొలవరి కొలవరిడి" పాత లాగా బాగా ప్రజాదరణ పొందే అవకాశం ఉందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.