English | Telugu

వన్ కొడుకు డబ్బింగ్ చెప్తున్నాడు

మహేష్ హీరోగా నటిస్తున్న చిత్రం "1". ఈ చిత్రంలో మహేష్ తనయుడు గౌతమ్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు శబ్దాలయ స్టుడియోలో జరుగుతున్నవి. ఇందులో మహేష్, గౌతమ్ లు కలిసి డబ్బింగ్ పనుల్లో పాల్గొంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు ఈనెల 19న విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో మహేష్ సరసన కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తుంది. 14రీల్స్ బ్యానర్లో అనిల్ సుంకర, గోపి ఆచంట, రామ్ ఆచంట కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.