English | Telugu

బాలీవుడ్‌లో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్

హాలీవుడ్ హీరోలా కనిపించే మన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు బాలీవుడ్ సినిమాల ఆఫర్లు ఎన్ని సార్లు వచ్చినా ఒప్పుకోలేదు. నేష్నల్ లెవల్ యాడ్స్ తప్ప హిందీ సినిమాలకు ఆయన నో చెప్తూ వచ్చారు. అయితే ఈ మధ్య టైమ్స్ గ్రూప్ ఆల్ ఇండియా లెవల్‌లో జరిపిన మోస్ట్ డిజైర్డ్ మ్యాన్ పోల్ లో మన మహేష్ నెంబర్ వన్‌గా నిలిచాడు. ఈ సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న అభిమానుల మీద నమ్మకం, ప్రేమ కొంచెం ఎక్కువయ్యాయి కాబోలు హిందీ సినిమాలోను నటిస్తానంటున్నాడు.
అలాగే ఒక ఇంగ్లీషు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు నెంబర్ వన్ స్థానాన్ని కట్టబెట్టిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. స్థానం కన్నా అందరితో కలిసి ఉండగలగటం ఆనందంగా ఉందని తెలిపారు. చక్కటి కథ దొరికితే హిందీలోనూ నటిస్తానని మహేష్ చెప్పటంతో, బాలీవుడ్ దర్శకులకి ప్రిన్స్ ఇన్విటేషన్ ఇచ్చినట్లే అని భావించవచ్చు.


ఇక మహేష్ డేట్ల కోసం తెలుగు తో పాటు తమిళ సినీ పరిశ్రమకు చెందిన మురుగుదాస్, మణిరత్నం లాంటి పెద్ద దర్శకులు ఎదురుచూస్తున్నారు. ఏడాదికి ఒకటి, రెండు సినిమాలు మాత్రమే విడుదల చేసే హీరోలవటంతో హిందీ సినిమాల్లో మహేష్ ను చూడటానికి అభిమానులు ఇంకా ఎంత కాలం వేయిట్ చేయవలసి వస్తుందో.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.