English | Telugu

మహేష్ బాబు ఐడియా సెల్యులర్ యాడ్

మహేష్ బాబు ఐడియా సెల్యులర్ యాడ్ లో నటించారు. వివరాల్లోకి వెళితే ఒక సినిమాలో నటించే మొత్తం నాలుగు యాడ్లలో నటిస్తే వస్తుందని వినికిడి. ఒక సినిమా కోసం ఆరునెలల సమయం పడితే ఒక యాడ్ ఫిల్మ్ కోసం కేవలం నాలుగైదు రోజులు పడుతుంది. ఈ యాడ్ ఫిలింస్ లో తక్కువ శ్రమ ఎక్కువ ఫలితం దక్కుతుంది. ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు ఐడియా సెల్యులర్ 3 జి యాడ్ లో నటించారు. ఈ యాడ్ లో నటించినందుకు మహేష్ బాబుకు సొమ్ము బాగానే గిట్టినట్లు సమాచారం.

ఈ ఐడియా సెల్యులర్ అనేది ఆదిత్య బిర్లా గ్రూప్స్ కు చెందినది కావటం విశేషం. గతంలో మహేష్ బాబు నవరత్న హెయిల్ ఆయిల్, వివిల్ షాంపూ, థంప్సప్ వంటి కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. ఇటీవల మలబార్ గోల్డ్ కంపెనీ కూడా ముందుగా మహేష్ బాబునే సంప్రదించినా, చివరి నిముషంలో ఆ కంపెనీకి యన్ టి ఆర్ ఆ బ్రాండ్ అంబాసిడర్ గా చేరాడు. మహేష్ బాబు నటించిన ఐడియా సెల్యులర్ యాడ్ ఈ వారం నుండి టి.వి.ల్లో టెలికాస్ట్ ప్రారంభమవుతుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.