English | Telugu

ఓ మై తమన్.. ఇదేం పాట!

'గుంటూరు కారం' సినిమాకి సంగీత దర్శకుడిగా తమన్ ని తీసుకోవడంపై మహేష్ బాబు అభిమానులు ముందు నుంచి వ్యతిరేకించారు. ఎందుకంటే మహేష్ గత చిత్రం 'సర్కారు వారి పాట' సంగీతం విషయంలో వారు సంతృప్తి చెందలేదు. పాటలు కొంతవరకు పరవాలేదు అనిపించినప్పటికీ.. నేపథ్య సంగీతం పూర్తిగా తేలిపోయిందనే అభిప్రాయం వ్యక్తమైంది. అందుకే 'గుంటూరు కారం'కి తమన్ ని తీసుకోవద్దని డిమాండ్ చేశాడు. అయితే దర్శకుడు త్రివిక్రమ్ మాత్రం తమన్ వైపే మొగ్గు చూపాడు. ఎందుకంటే ఆయన గత చిత్రం 'అల వైకుంఠపురములో' విజయంలో తమన్ సంగీతం కీలక పాత్ర పోషించింది. అందుకే తమన్ మీద నమ్మకంతో త్రివిక్రమ్ అతనికే అవకాశమిచ్చాడు.

ఇక చేసేదేం లేక, త్రివిక్రమ్-తమన్ కాంబినేషన్ మీద ఉన్న నమ్మకంతో మహేష్ అభిమానులు 'గుంటూరు కారం' పాటల కోసం ఎదురుచూశారు. మొదటి పాట 'ధమ్ మసాలా' ఫ్యాన్స్ ని ఎంతగానో మెప్పించింది. ముఖ్యంగా లిరిక్స్ కట్టిపడేశాయి. సాంగ్ 'అల వైకుంఠపురములో' రేంజ్ లో లేనప్పటికీ, బాగానే ఉందనే పేరుని తెచ్చుకోగలిగింది. దీంతో 'గుంటూరు కారం' చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ అవుతుందని అభిమానులు బలంగా నమ్మారు. అయితే తాజాగా విడుదలైన రెండో పాట 'ఓ మై బేబీ' విషయంలో మాత్రం వాళ్ళు ఫుల్ డిజప్పాయింట్ అయ్యారు. సంగీతం, సాహిత్యం ఏదీ కూడా మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా స్థాయిలో లేవని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభిమానులైతే "ఓ మై తమన్.. ఇదేం పాట" అంటూ సోషల్ మీడియా వేదికగా తమన్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు అభిమానులు మాత్రం పాట వినగా వినగా నచ్చుతుందని, ఇలా తొందరపడి ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.