English | Telugu

మహేష్ బర్త్ డేకి 'ఆగడు' గిఫ్ట్

సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఆగడు. ఈ సినిమా క్లైమాక్స్ సంబంధించిన సన్నివేశాలను ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారు. ఆ తరువాత సినిమాలోని పాటల చిత్రీకరణ కోసం మూవీ యూనిట్ నార్వే వెళ్ళనుంది.అయితే తాజా సమాచారం ప్రకారం ఈ నెల 9న సూపర్ స్టార్ మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగడు సినిమాకి సంబంధించి సెకండ్ టీజర్ ను విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. కృష్ణ పుట్టినరోజు సంధర్బంగా విడుదల చేసిన టీజర్ కి స్టన్నింగ్ రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. అలాగే, ఈ టీజర్ లో మహేష్ బాబు చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్ బాగా అలరించాయి. మరీ మహేష్ బర్త్ డే సందర్బంగా విడుదలకానున్న టీజర్ ఎలాంటి డైలాగ్స్ పేలుస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.