English | Telugu

వచ్చేనెలలో వస్తున్న ‘అల్లుడు శీను’


నిర్మాతల కొడుకులు పరిశ్రమకు హీరోలుగా పరిచయమవడం తెలుగు పరిశ్రమలో ఎప్పటినుంచో వస్తున్న ట్రెండ్. ఈ కోవలో తాజాగా నిర్మాత బెల్లంకొండ సురేష్తనయుడు సాయిశ్రీనివాస్‌ హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ప్రముఖ దర్శకుడు వినాయక్ దర్శకత్వంలో సాయిశ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు. ‘అల్లుడు శీను’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంత నటిస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించి కొత్త పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని జూలై 24న విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే జూన్ 29న ఈ చిత్ర ఆడియోని కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. తాను పరిచయం చేసిన దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో తన తనయుడు తొలిచిత్రం రూపుదిద్దుకోవడం ఆనందంగా వుందని సురేష్ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తుండగా, కెమెరా చోటా కే. నాయిడు.


సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.