English | Telugu
అదరగొడుతున్న బాలయ్య లెజెండ్
Updated : Feb 23, 2014
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న "లెజెండ్" మూవీ టైటిల్ ను ఇటీవలే లోగో విడుదల చేసారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇందులో ప్రతిది కూడా కొత్తగా ఉండేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో జగపతిబాబు విలన్ పాత్రలో నటిస్తున్నాడు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, డైలాగ్స్ ప్రేక్షకులకు పెద్ద పండగ అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. అంతే కాకుండా తొలిసారిగా బాలకృష్ణ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మార్చి 7న పాటలను శిల్పకళావేదికలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.