English | Telugu

ఫిబ్రవరి 15న కొచ్చడయన్ పాటలు

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన "కొచ్చడయన్" చిత్ర ఆడియోను ఫిబ్రవరి 15న విడుదల చేయనున్నారు. సోనీ మ్యూజిక్ సంస్థ ఆడియో హక్కులను సొంతం చేసుకుంది. ఈరోస్ ఇంటర్నేషనల్, మీడియా ఎన్ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ దీనిని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రజనీ కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదుకునే, శోభనలు కథానాయికలుగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.