English | Telugu

కియార‌కి శంక‌ర్ స్పెష‌ల్ గిఫ్ట్!

కియారా అద్వానీకి స్పెష‌ల్ గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నారు శంక‌ర్. రేపు(జూలై 31న) కియారా బ‌ర్త్ డే. పుట్టిన‌రోజు సెల‌బ్రేష‌న్స్ కోసం ముందుగానే భ‌ర్త‌తో క‌లిసి వెకేష‌న్‌కి వెళ్లారు కియారా. ఆమె ప్ర‌స్తుతం తెలుగులో రామ్‌చ‌ర‌ణ్ ప‌క్క‌న శంక‌ర్ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఆమె లుక్‌ని సోమ‌వారం విడుద‌ల చేస్తార‌ని టాక్‌.

ఇటీవ‌ల కొంత‌కాలంగా గేమ్ చేంజ‌ర్ గురించి అస‌లు ఎలాంటి అప్‌డేట్స్ లేవు. శంక‌ర్ పూర్తిగా ఇండియ‌న్‌2కి ప‌రిమిత‌మ‌య్యారు. రామ్‌చ‌ర‌ణ్ త‌న త‌న‌య క్లీంకారతో బిజీ అయ్యారు. అందుకే మ‌ళ్లీ సినిమా మూడ్‌లోకి ఫ్యాన్స్ ని తీసుకుని రావాలంటే, ఇంత‌క‌న్నా బెస్ట్ అకేష‌న్ ఉండ‌ద‌ని అనుకుంటున్నార‌ట మేక‌ర్స్. దీని గురించి అఫిషియ‌ల్‌గా ఎలాంటి ప్ర‌క‌ట‌నా లేదు. కాక‌పోతే రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన‌రోజున ఆయ‌న ఫ‌స్ట్ లుక్‌ని రివీల్ చేశారు. అదే క్ర‌మంలో కియారా పుట్టిన‌రోజున ఆమె లుక్ రిలీజ్ చేస్తార‌నే ఎదురుచూపులున్నాయి.

బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుంటున్నారు కియారా. ఆమె న‌టించిన లాస్ట్ మూవీ స‌త్య‌ప్రేమ్‌కి క‌థ చాలా పెద్ద హిట్ అయింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కి ఫిదా అయిపోయామంటున్నారు ఫ్యాన్స్.

పెళ్లి త‌ర్వాత కూడా గ్లామ‌ర్ విష‌యంలో అస‌లు ఏమాత్రం త‌గ్గ‌లేదు కియారా. త‌న గురించి ర‌క‌ర‌కాలుగా రాసేవారి గురించి ఒక‌రోజు కియారా ఫీల్ అయ్యార‌ట‌. అది ప్రొఫెష‌న్ అని, అక్క‌డ అలాగే ఉండాల‌ని ఆమె భ‌ర్త స‌పోర్ట్ చేశార‌ట‌. దీన్ని బ‌ట్టి శంక‌ర్ సినిమాలోనూ కియారా అందాల ఆర‌బోత ఒక రేంజ్‌లో ఉంటుంద‌న్న‌ది ఫ్యాన్స్ గెస్‌.

శంక‌ర్‌తో ప‌నిచేయ‌డం వ‌ల్ల కెరీర్‌లో ఎంతో నేర్చుకున్నట్టు ఆల్రెడీ చెప్పారు కియారా. రామ్‌చ‌ర‌ణ్‌తో ఆమె న‌టించ‌డం ఇదేం ఫ‌స్ట్ టైమ్ కాదు, ఇంత‌కు ముందు విన‌య‌విధేయ‌రామలో న‌టించారు ఈ ఇద్ద‌రూ.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.