English | Telugu

‘ఖాకీ’ మూవీ రివ్యూ

సినిమా పేరు: ఖాకి
తారాగణం: కార్తి, రకుల్ ప్రీత్ సింగ్...
దర్శకత్వం: వినోద్
నిర్మాత: ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా

సాధారణంగా సినిమాల్లో పోలీస్ కథలు.. గుండా రాజకీయాల చుట్టూనో.. లేక మాఫియా చుట్టూనో తిరుగుతుటాయ్. మన  దర్శకుల ఆలోచనలు అంతవరకే. కానీ.. పోలీస్ డిపార్ట్మెంట్ తో కూడిన వాస్తవ ఘట్టాలను పరిశీలస్తే... కళ్లు బైర్లు కమ్ముతాయ్. నేరస్థులు నేరం చేసే విషయంలో ఎంత తెలివిగా,  సునిశితంగా ఉంటారో..నేర పరిశోదన విషయంలో పోలీసులు అంతకు మించిన సునిశితం, తెలివిగా ఉంటారు. ఈ దిశగా కథలు ఆలోచిస్తే... అద్భుతమైన కథలు పుడతాయ్. ‘ఖాకీ’ సినిమా విషయంలో దర్శకుడు వినోద్ అలాగే ఆలోచించాడు.
పోలీస్ వ్యవస్థ ఛాలెంజ్ గా తీసుకొన్న ఎన్నో కేసుల్ని అధ్యయం చేస్తే తప్ప.. ‘ఖాకీ’ లాంటి కథ పుట్టదు. మిగతా దర్శకులను భిన్నంగా తన ఆలోచనా పరిథిని పెంచుకుంటూ.. ఓ అద్భుతాన్నే సెల్యులాయిడ్ పై ఆవిష్కరించాడు వినోద్. కార్తీ కథానాయకునిగా తమిళంలో రూపొందిన ‘తీరమ్ అధికారమ్ వెట్రూ’ చిత్రం ‘ఖాకీ’ పేరుతో తెలుగులో అనువాదమైంది. ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు చెప్పుకునే ముందు.. కథేంటో చూద్దాం.

కథ:

దేశానికి శనిగా పట్టిన దొంగల ముఠా ‘భవారియా ట్రైబుల్స్’. రాజస్థాన్ కి చెందిన  చెందిన ఈ రాకాసి దొంగల ముఠా... అదను చూసుకొని రాత్రుళ్లు ఇళ్లపై పడి దోచుకుంటూ అడ్డుచ్చినవాళ్లను దారుణంగా చంపుకుంటూ పోతుంటారు. వందల ఏళ్ల చారిత్రాత్మక నేపథ్యం కలిగిన ఈ దొంగల ముఠాను పట్టుకునే బాద్యతను డీఎస్పీ ధీరజ్ కు అప్పచెబుతుంది పోలీస్ డిపార్ట్మెంట్. ఈ ప్రమాదకరమైన ఆపరేషన్లో ధీరజ్ ఎదురైన అనుభవాలేంటి? తాను ఏం పోగొట్టుకున్నాడు? ఏం సాధించాడు? అనేది మిలిగిన కథ.

విశ్లేషణ:

చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమాను, ఓ కొత్త సినిమా చూసిన అనుభూతి. నిజంగా దర్శకుడు వినోద్ ని అభనందించకుండా ఉండలేం. ఈ సినిమాను పరిశీలనగా చూస్తే.. ఒక్క వేస్ట్ సీన్ కూడా ఇందులో కనిపించదు. ఒక పేకమేడలా కథనాన్ని రాసుకున్నాడు. కార్తి లాంటి స్టార్.. ఇందులో చేసినా.. ఇది మ ాత్రం పూర్తిగా దర్శకుని సినిమా అందులో నో డౌట్. ఇలాంటి దొంగల ముఠాల నేపథ్యంలో గతంలో కొన్ని సినిమాలొచ్చాయ్. ఉదాహరణకు ‘దండుపాళ్యం’. అయితే అది  ఓ ప్రాంతానికి మాత్రమే చెందిన కథ. కానీ.. ఇది దేశానికే సమస్యగా మారిన దొంగల ముఠా కదా. దానికి తగ్గట్టుగానే సన్నివేశాలు డిజైన్ చేశాడు. ‘భావారియా ట్రైబల్స్’ ఎంత ప్రమాదకరంగా ఉంటారో... వారి జీవన శైలి ఏ విధంగా ఉంటుందో.. వాళ్లు దొంగలుగా ఎలా మారారో.. అతను వివరించిన తీరు నిజంగా వండర్. రాజస్థాన్ వాతావరణంలోకి తీసుకెళ్లి ప్రేక్షకుడ్ని కూర్చోబెట్టేశాడు. దొంగల చర్యలు, పోలీసుల ప్రతిచర్యలు  ప్రేక్షకులకు ఉత్కంకు లోను చేస్తాయ్.

కార్తీ కెరీర్లో ఇది బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. పోలీస్ అనగానే.. అనవసరపు ఆర్భాటాలు, హంగామా చేయకుండా.. పోలీస్ కూడా మనలో ఒక్కడే అన్న రీతిలో  నాచురల్ గా చేశాడు. సినిమా ఎలాగైతే వాస్తవానికి దగ్గరగా ఉందో.. కార్తీ నటన కూడా అలగే ఉంది. రకుల్ ఇందులో చాలా అందంగా ఉండటమే కాదు.. చక్కగా నటించింది కూడా. వేస్ట్ కేరక్టర్ కూడా ఇందులో ఒక్కటి కూడా లేకపోవడం విశేషం.

సాంకేతికంగా సత్యన్ సూర్యన్ కెమెరా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రాజస్థాన్ వాతావరణాన్ని తన కెమెరాలో బంధించేశాడు. గిబ్రన్ నేపథ్య సంగీతం బావుంది. శివనందీశ్వరన్ ఎడిటింగ్ సూపర్బ్.
అంతా బావుంది కానీ.. సినిమా ముక్తాయింపులో మాత్రం క్లారిటీ లేదు. అంత మంచి సిన్సియర్ ఆఫీసర్ ని ఎందుకని డిపార్ట్మెంట్ డిమోట్ చేసిందో అర్థం కాదు.

ఓవరాల్ గా ఈ మధ్య వస్తున్న సినిమాలతో పోలిస్తే.. ఇది నిజంగా అద్భుతం. అనవసపు ఖర్చు లేకుండా, అనవసరపు హంగామా లేకుండా, అనవసరపు సన్నివేశాలు లేకుండా కథను కథగా చూపించి శబాష్ అనిపించుకున్నాడు దర్శకుడు వినోద్. తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా.

రేటింగ్:3