English | Telugu

మెగా హీరోలకు నిజంగానే అన్యాయం జరిగిందా?


నందుల్ని ఏ ముహూర్తాన ఎనౌన్స్ చేశారో కానీ.. రచ్చ రచ్చ అవుతుంతోంది. ఒకాయనేమో... ‘మనం’కి అన్యాయం జరిగిందంటాడు. ఇంకొకాయనేమో మా మెగా హీరోలను తొక్కేశారంటాడు. టీవీలెక్కి గగ్గోలు పెడతాడు. ఇవి నంది బహుబతులు కాదు.. సైకిల్ బహుమతులంటాడు. ఏంటో ఈ రచ్చ. 

వాస్తవం మాట్లాడితే.. ‘మనం’కి అన్యాయం జరిగిన  మాట నిజం. ఇది మేధావులు సైతం అంగీకరిస్తున్న మాట. ఏ విషయాలను ప్రామాణికంగా చేసుకొని ‘లెంజెండ్’ ని ఉత్తమ చిత్రాన్ని చేశారు? ఏం లోపాలున్నాయని ‘మనం’ చిత్రాన్ని రెండో స్థానంతో సరిపెట్టారు? ఇవి అంతు చిక్కని ప్రశ్నలే.

ఇక ‘మెగా ఫ్యామిలీ‘ వ్యవహారినికొస్తే...  అసలు వీరికి నిజంగా అన్యాయం జరిగిదా?  అనేది తెలుసుకోవాంటే.. విషయాన్ని కాస్త లోతుగా అధ్యయనం చేయాలి. మెగాహీరోల్లో చిరంజీవి రీ ఎంటరీ ఇచ్చింది 2017లో కాబట్టి.. ఈ అల్లరిలో ఆయన లేనట్టే.

పవన్ కల్యాణ్:-

2013లో ‘అత్తారింటికి దారేది’తో విజయాన్ని అందుకున్న పవన్.. ఆ తర్వాత చేసిన సినిమా ‘గోపాల గోపాల’. ఇది ఆయన  2015లో చేసిన ఏకైక సినిమా. అంటే.. 2014లో పవర్ స్టార్ ఒక్క సినిమా కూడా చేయలేదన్నమాట. 2015లో చేసిన ‘గోపాల గోపాల’ లో  ఆయన చేసింది గెస్ట్ రోల్. ఇక 2016లో వపవ్ నటించిన సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ఇది భారీ డిజాస్టర్. పవర్ స్టార్ ఇందులో అద్భుతంగా చేసింది కూడా ఏమీ లేదు. కాబట్టి 2014, 15, 16 పోటీల్లో పవన్ లేనట్టే.   

రామ్ చరణ్:-

2014లో చరణ్ రెండు సినిమాలు చేశాడు. అందులో ఒకటి ‘ఎవడు’ కాగా, రెండోది ‘గోవిందుడు అందరి వాడేలే’. వీటిల్లో ‘ఎవడు’ సూపర్ హిట్. అయితే.. ఉత్తమనటునిగా అవార్డు తీసుకునేంత గొప్పగా నటించాడా? అనేది జనమే చెప్పాలి. ఇక రెండోది ‘గోవిందుడు అందరివాడేలే’. భారీ డిజాస్టర్. జనం కూడా మెచ్చని సినిమా. ఇదసలు పోటీలో ఉండదు.
ఇక 2015లో చరణ్ చేసిన  ఏకైక సినిమా ‘బ్రూస్లీ’. దీనికి గురించి మాట్లాడుకోవడం అనవసరం. 201 6లో చరణ్ నుంచి వచ్చిన సినిమా ‘ధృవ’. కచ్చితంగా మంచి సినిమా. అయితే.. రీమేక్ ఫిలిం. అవార్డుల్లో దీనికి స్థానం ఉండదు. మరి వీటిని బట్టి చరణ్ కి అవార్డుల్లో స్థానం ఇవ్వొచ్చా? అనేది జనానికే వదిలేద్దాం. .

బన్నీ:-

2014లో బన్నీ చేసిన సినిమాలు రెండు. వాటిల్లో  ఒకటి ‘రేసుగుర్రం’. రెండు ‘ఎవడు’. ’ఎవడు’లో బన్నీది గెస్ట్ రోల్ కాబట్టి పక్కన పెట్టేయొచ్చు. ఇక ‘రేసుగుర్రం’. కచ్చితంగా అవార్డు తీసుకోదగ్గ సినిమా. ఇందులో బన్నీ పెర్ ఫార్మెన్స్ కూడా పీక్స్ లో ఉంటుంది. కామెడీతో పాటు అద్భుతమైన ఎమోషన్స్ పలికించాడు. 2014లో ఉత్తమ నటుని కేటరిగిలో తప్పకుండా పోటీ ఇచ్చే సినిమా ‘రేసుగుర్రం’.  ‘లెజెండ్’గా బాలయ్య విశ్వరూపం చూపించి ఉండొచ్చు. కానీ..‘రేసుగుర్రం’లో బన్నీ ఏం తక్కువ చేయలేదు. అత్యద్భుతంగా చేశాడు. 2015లో ‘సన్నాప్ సత్యమూర్తి’ , ‘రుద్రమదేవి’  చేశాడు. ‘రుద్రమదేవి’కి బెస్ట్ కేరక్టర్ యాక్టర్ అవార్డును బన్నీకి కంటి తుడుపుగా కట్టబెట్టారు.  ఇక 2016లో బన్నీ చేసిన ఏకైక సినిమా    ‘సరైనోడు’. అన్నీ మంచి పాత్రలే. జనం మెప్పించిన చిత్రాలే. కానీ.. బన్నీ... ఉత్తమ కేరక్టర్ నటునిగా మాత్రమే సరిపెట్టుకోవలసి వచ్చింది. . ఏ పాటికీ... పవన్  కల్యాణ్ గురించీ, రామ్ చరణ్ గురించీ అందరూ అడుగుతున్నారు కానీ.. అసలు నిజంగా పోటీలో నిలిచే అర్హతలున్న అల్లు అర్జున్ గురించి మాత్రం ఎవరూ మాట్లాడకపోవడం నిజంగా అన్యాయం.

సాయిధరమ్ తేజ్:-

2014లోనే సాయిధరమ్ తేజ్ కెరీర్ మొదలైంది. తొలి సినిమా ‘రేయ్’కంటే ముందు ‘పిల్లా నువ్వులేని జీవితం’ వచ్చింది. సూపర్ హట్. 2015లో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చేశాడు. 2016 ‘సుప్రీమ్’ చేశాడు. తను చేసిన సినిమాలను పరిగణనలోకి ీతీసుకొని ఉత్తమ నూతననటుడిగా అతడ్ని ఎంచుకోవచ్చు. కానీ.. పక్కన పెట్టేశారు.

వరుణ్:-

2014లో ‘ముకుంద’తో పరిచయం అయ్యాడు. ఫర్వాలేదనిపించాడు. 2015లో ‘కంచె’ వచ్చింది. అద్భుతం అనిపించాడు. ‘కంచె’లో వరుణ్ నటనకు జ్యూరీ అయినా ఇవ్వొచ్చు.

దీన్ని బట్టి అర్థమైందేంటి?  మెగా హీరోల్లో 2014కి కాను.. ‘బాలయ్య’కు ధీటైన నటన కనబరచిన నటుడు అల్లు అర్జున్ మాత్రమే.

2015లో మహేశ్ తో ఢీ కొట్టేంత పాత్రలు చేసిన మెగా హీరో లేడు.

2016లో ఎన్టీయార్ తో ఢీ కొట్టేంత పాత్రలు కూడా ఒక్క మెగా హీరో కూడా చేయలేదు.

చివరిగా చెప్పేదేంటంటే... మహేశ్, ఎన్టీయార్ల ఎంపిక విషయంలో ఎలాంటి కాంట్రవర్సీ లేదు. బాలయ్య విషయంలో మాత్రం బన్నీ పోటీ ఉన్నాడు.

‘ఇద్దరూ బాగా చేశారు. ‘లెజెండ్’లో బాలయ్య నటన అద్భుతం. ‘రేసుగుర్రం’లో బన్నీ నటన వండర్. బాలయ్యకు ఉత్తమ నటుడు రావడం తప్పు కాదు. కానీ.. బన్నీకి తగిన గౌరవం ఇస్తే బావుండేదేమో!’ అని క్రిటిక్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.