English | Telugu

కీర్తి సురేష్ పొలిటికల్ ఎంట్రీ.. ఏ పార్టీనో తెలుసా..?

సినిమాలకు, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది. ఎందరో సినీ స్టార్స్ రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఇదే బాటలో కీర్తి సురేష్ కూడా పయనించనుందా? అనే చర్చ జరుగుతోంది.

ఇటీవల ఓ ఈవెంట్ కోసం కీర్తి సురేష్ మధురై వెళ్ళగా.. అక్కడి అభిమానులు "టీవీకే టీవీకే" అంటూ నినాదాలు చేశారు. టీవీకే అనేది దళపతి విజయ్ స్థాపించిన పార్టీ పేరు. కీర్తికి, విజయ్ కి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇద్దరు కలిసి సినిమాలు చేశారు. అలాగే కీర్తి పెళ్ళికి విజయ్ హాజరయ్యాడు. అందుకే కీర్తి టీవీకే పార్టీలో చేరితే బాగుంటుందని ఫ్యాన్స్ ఆ విధంగా నినాదాలు చేశారు. అయితే ఆ నినాదాలు ఇబ్బందిగా అనిపించినా లేదా పాలిటిక్స్ లోకి రావడం ఇష్టంలేకపోయినా.. ఆ సమయంలో అసహనం వ్యక్తం చేయడం సహజం. కానీ, కీర్తి నుంచి అసహనం వ్యక్తం కాలేదు. దాంతో ఆమెకు పాలిటిక్స్ ఆసక్తిగా ఉన్నట్లుందని, త్వరలో విజయ్ పార్టీలో చేరినా ఆశ్చర్యంలేదు అంటూ చర్చలు జరుగుతున్నాయి. మరి కీర్తి సురేష్ నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

సినిమాల విషయానికొస్తే.. ఇటీవల కీర్తి సురేష్ 'ఉప్పు కప్పురంబు' అనే ఓటీటీ ఫిల్మ్ తో ప్రేక్షకులను పలకరించింది. అలాగే తమిళ్ లో 'రివాల్వర్ రీటా', 'కన్నివేది' అనే సినిమాలు చేస్తోంది.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.