English | Telugu

రామ్ చరణ్ రచ్చకి పాటలు వ్రాస్తున్న కేదార్ పరిమి

రామ్ చరణ్ రచ్చకి పాటలు వ్రాస్తున్న కేదార్ పరిమి అని వినిపించింది. వివరాల్లోకి వెళితే విజయవాడ సమీపాన కల నందిగామ నుండి యమ్.యస్., యమ్.ఫిల్ చదివిన కేదార్ పరిమి సంస్కృత పండితుడైన ఓగేటి పరీక్షిత్ శర్మగారి మనవడు. ఓగేటి పరీక్షిత్ శర్మ గారు "పరీక్షిన్నాటక చక్రం" అనే చక్కని గ్రంధాన్ని వ్రాశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ విజేత అయిన ఈ కేదార్ పరిమి గతంలో "ఆర్య-2, మిస్టర్ పర్ ఫెక్ట్, ఆరెంజ్ (సిడ్నీ నగరం)" చిత్రాల్లో పాటలను వ్రాశారు. ప్రస్తుతం కేదార్ పరిమి "రచ్చ" చిత్రానికి పాటలు వ్రాస్తున్నారు.

కేదార్ పరిమిని మెగాస్టార్, పద్మభూషణ్, డాక్టర్ చిరంజీవి బాగా ప్రోత్సహిస్తున్నారు. మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, "ఏమైందీ ఈ వేళ" ఫేం సంపత్ నంది దర్శకత్వంలో యన్.వి ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న విభిన్న కథా ప్రేమకథా చిత్రం"రచ్చ". ఈ "రచ్చ" సినిమాలో హీరో రామ్ చరణ్ కి స్నేహితుడిగా వెన్నెల కిశోర్ నటిస్తున్నారు. ప్రస్తుతం "రచ్చ" చిత్రం షుటింగ్ శరవేగంగా జరుగుతోంది.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.