English | Telugu

సింగనమల 5 సిమ్ కార్డులు సీజ్

సింగనమల 5 సిమ్ కార్డులు సీజ్ చేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే ప్రముఖ సినీ ఫైనాన్సియర్, ప్రముఖ సినీ నిర్మాత అయిన సింగనమల రమేష్ గతంలో ప్రిన్స్ మహేష్ బాబుతో "ఖలేజా" అనే సినిమాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‍ తో "కొమరంపులి" అనే సినిమాను నిర్మించాడు. ఈ రెండు సినిమాలూ సింగనమల రమేష్ కు బాగా నష్టాలను తెచ్చి పెట్టాయి. ఈ సినిమాలకు పెట్టిన డబ్బు ఒక్క పైసా కూడా తిరిగిరాలేదట. దాంతో మద్దులచెరువు సూరి, భాను కిరణ్ లతో కలసి తనకు అప్పిచ్చిన వారిని బెదిరించటం చేశాడట. అలా తనకు 7.5 cr అప్పిచ్చిన వైజయంతీ రెడ్డిని బెదిరించాడు. మద్దుల చెరువు సూరిని భానుకిరణ్ హత్యచేసిన తరువాత, భానుకిరణ్ ఆస్తులన్నింటినీ బినామీ పేర్ల మీద సింగనమల రమేష్ తన అదుపులోనే ఉంచుకున్నాడనీ, అందుకే తాను దొరికితే భాను కిరణ్ దొరుకుతాడని తాను కూడా గత ఆరు నెలలుగా తప్పించుకు తిరుగుతూ ఇటీవల సి ఐ డి పోలీసులకు చెన్నై సమీపంలో దొరికాడు సింగనమల రమేష్.

సింగనమల రమేష్ ని హైదరాబాద్ కి రప్పించిన సిఐడి పోలీసులు గత మూడు రోజులుగా అతన్ని ఇంటరాగేట్ చేస్తున్నారు. సింగనమల రమేష్ నుండి స్వాధీనం చేసుకున్న 5 సిమ్ కార్డులను పోలీసులు సీజ్ చేశారు. అతన్నించి స్వాధీనం చేసుకున్న 5 సిమ్ కార్డుల కాల్ హిస్టరీ తెలుసుకుంటే భాను కిరణ్ ఎక్కడున్నాడో తెలుసుకోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సింగనమల రమేష్ ని సోమవారం కోర్టుకి అప్పగించనున్నారు. అతని వద్ద కొంత కీలక సమాచారాన్ని సి.ఐ.డి.పోలీసులు సేకరించారట. కానీ ఈ విషయాన్ని తెలియజేయటానికి ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న ఐ.జి.యస్.ఉమా పతి నిరాకరించారు. సింగనమల రమేష్ దొరికిన తర్వాత ఎక్కడ తమ పేరు బయటపెడతాడోనని కొంతమంది సినీ సెలబ్రిటీస్ కి కునుకు లేకుండా పోయింది. సింగనమల రమేష్ అరెస్ట్ అవటం వలన మద్దులచెరువు సూరి హత్యకేసు త్వరగానే చిక్కువీడి పోగలదని పోలీసులు భావిస్తున్నారు.