Read more!

English | Telugu

ప్రియాంకచోప్రాకు దాదాసాహెబ్ ఫాల్కే..!

ప్రియాంక చోప్రా...నిజ జీవిత కథలు తీయాలన్నా, లేడీ ఓరియేంటేడ్ మూవీస్ చేయ్యాలన్నా బాలీవుడ్ డైరెక్టర్స్‌కు ఉన్న ఛాయిస్. బాలీవుడ్, టాలీవుడ్‌‌లోనే కాదు హాలీవుడ్‌‌లోనూ ప్రియాంకకు క్రేజ్ ఉంది. సినిమాల్లో సక్సెస్‌లతో పాటు అనేక ప్రతిష్టాత్మక అవార్డులు ఆమె వద్దకు క్యూకట్టాయి. భారతీయ సినిమాకు ఆమె చేసిన సేవకు గానూ దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డునిచ్చి గౌరవించింది భారత ప్రభుత్వం. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి సనీ ప్రపంచం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు చేరింది.

దాదా సాహెబ్ ఫాల్కే 147వ జయంతిని పురస్కరించుకుని దాదా సాహెబ్ ఫిల్మ్ ఫౌండేషన్ ఉత్తమ నటిగా ప్రియాంకను ఎంపిక చేసింది. బాజీరావ్ మస్తానీ చిత్రానికి గానూ ఈ ఏడాది ఉత్తమనటి పురస్కారం ప్రియాంకను వరించింది. ప్రియాంక ఈ అవార్డును అందుకోవడం ఇది రెండవ సారి. 2011లో వచ్చిన సాత్ ఖూన్ మాఫ్ చిత్రానికి ఈమె మొదటిసారి దాదాసాహెబ్ అవార్డును అందుకుంది. ఏప్రిల్ 24న ముంబైలో జరిగే కార్యక్రమంలో ప్రియాంకకు అవార్డును ప్రదానం చేయనున్నారు.