English | Telugu

‘స్పిరిట్‌’ విషయంలో క్లారిటీ ఇచ్చిన కరీనా.. మరి కాజోల్‌ ఏం చేస్తుందో?

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ చేతిలో ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నప్పటికీ ఇటీవల ప్రారంభమైన ‘స్పిరిట్‌’పై భారీ అంచనాలు ఉన్నాయి. అర్జున్‌రెడ్డి, కబీర్‌సింగ్‌, యానిమల్‌ వంటి పవర్‌ఫుల్‌ సినిమాలతో డైరెక్టర్‌గా ఒక రేంజ్‌లో ఫేమస్‌ అయిపోయారు సందీప్‌రెడ్డి వంగా. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై రోజురోజుకీ హైప్‌ పెరుగుతోంది. ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ‘స్పిరిట్‌’కి సంబంధించి ఏ చిన్న అప్‌డేట్‌ వచ్చినా అది క్షణాల్లో వైరల్‌ అయిపోతోంది. తాజాగా ఈ సినిమాలోని ఒక కీలక పాత్ర విషయంలో రకరకాల వార్తలు వచ్చాయి. అయితే దానిపై క్లారిటీ వచ్చేసింది.

‘స్పిరిట్‌’ చిత్రంలో త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని మరో కీలక పాత్రలో బాలీవుడ్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ నటిస్తోందనే వార్త వచ్చింది. అయితే ‘స్పిరిట్‌’ చిత్రంలో తాను నటించడం లేదని కరీనా క్లారిటీ ఇచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలోని ఒక పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ కోసం కాజోల్‌ను సంప్రదించారని, ఆ క్యారెక్టర్‌ చేసేందుకు ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని తెలుస్తోంది. మరి కాజోల్ ఈ సినిమా చేస్తుందా లేదా అనే విషయంఅఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్‌ వచ్చే వరకు సస్పెన్సే.

గతంలో కాజోల్‌ రెండు తమిళ్‌ సినిమాల్లో నటించారు. ఆ సినిమాలు మెరుపుకలలు, విఐపి2 పేరుతో తెలుగులో డబ్‌ అయ్యాయి. తెలుగులో మాత్రం ఆమె ఒక్క సినిమా కూడా చెయ్యలేదు. ‘స్పిరిట్‌’ ఓకే అయితే ఇదే ఆమె తొలి తెలుగు సినిమా అవుతుంది. ఎక్కువగా హిందీ సినిమాలు చేసినప్పటికీ కాజోల్‌కి సౌత్‌లోనూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. కాబట్టి ఈ సినిమాకి కాజోల్‌ ఓ ప్రత్యేక ఆకర్షణ అయ్యే అవకాశం ఉంది. సందీప్‌ రెడ్డి సినిమాల్లో ప్రతి క్యారెక్టర్‌ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో మనం చూశాం. ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘స్పిరిట్‌’ చిత్రంలో కాజోల్‌ ఇప్పటివరకు చేయని ఒక డిఫరెంట్‌ క్యారెక్టర్‌ను సందీప్‌ క్రియేట్‌ చేశారని తెలుస్తోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.