English | Telugu

రాయలసీమ భరత్ హీరోగా ‘జగన్నాథ్’.. డిసెంబర్ 19న గ్రాండ్ రిలీజ్!

భరత్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద పీలం పురుషోత్తం నిర్మాణంలో భరత్, సంతోష్ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘జగన్నాథ్’. ఈ మూవీలో రాయలసీమ భరత్ హీరోగా, నిత్యశ్రీ, ప్రీతి, సారా హీరోయిన్లుగా నటిస్తున్నారు. భరత్ హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా చేస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రమోషన్స్ మీద చిత్రయూనిట్ ఫోకస్ పెట్టింది.

ఇప్పటికే ‘జగన్నాథ్’ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు జనాల్లో క్యూరియాసిటీని పెంచేశాయి. ఆల్రెడీ హీరో భరత్ జనాల్లోకి వెళ్లి సినిమాను డిఫరెంట్‌గా ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్‌లను విడుదల చేశారు. డిసెంబర్ 19న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇందుకోసం రిలీజ్ చేసిన పోస్టర్లను చూస్తుంటే యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా సినిమా రానుందని అర్థం అవుతోంది.

పోస్టర్లలో హీరో లుక్, రక్తంతో నిండిన ఆ తీరు చూస్తుంటే యాక్షన్ పాళ్లు ఎక్కువగానే ఉండేట్టు కనిపిస్తోంది. ఇక హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ కూడా సినిమాకు హైలెట్ అయ్యేలా ఉంది. ఈ సినిమాకు షేక్ వలి, క్రాంతి కుమార్ కెమెరామెన్స్‌గా, శేఖర్ మోపూరి సంగీత దర్శకుడిగా పని చేశారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.