English | Telugu

సంచలనం.. తెలుగులో ఒక్కరోజులో బ్రేక్ ఈవెన్ సాధించిన 'కాంతార'!

సంచలనం.. తెలుగులో ఒక్కరోజులో బ్రేక్ ఈవెన్ సాధించిన 'కాంతార'!

కన్నడ సినిమా 'కాంతార' తెలుగు రాష్ట్రాల్లో అంచనాలకు మించిన సంచలనం సృష్టిస్తోంది. తెలుగులో ఒక్క రోజులోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం భారీ విజయం దిశగా దూసుకుపోతోంది.

'కేజీఎఫ్'ను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ నుంచి వచ్చిన తాజా చిత్రం 'కాంతార'. కన్నడలో సెప్టెంబర్ 30న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకొని సంచలన విజయం దిశగా పరుగులు పెడుతోంది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రిషబ్ తో పాటు సప్తమి, కిషోర్, అచ్యుత్ కుమార్ తదితరులు నటించారు. తెలుగులో 'కాంతార'ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. నిన్న(అక్టోబర్ 15న) తెలుగులో విడుదలైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. మంచి కలెక్షన్స్ రాబడుతూ మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించింది.

తెలుగులో 'కాంతార' బిజినెస్ వాల్యూ రూ.2 కోట్లని అంచనా. అయితే ఈ చిత్రం మొదటి రోజే రూ.2.2 కోట్లకు పైగా షేర్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే రెండోరోజు(ఈరోజు) నుంచి వచ్చే కలెక్షన్స్ ప్రాఫిట్స్ అన్నమాట. ఈరోజు ఆదివారం కావడంతో మరో రూ.2 కోట్లకు పైగా షేర్ రాబట్టే అవకాశముంది. ఫుల్ రన్ లో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్లకు పైగా షేర్ రాబట్టినా ఆశ్చర్యంలేదు.