Read more!

English | Telugu

బూతులు తిట్టిన వాళ్లందరికీ సమాధానం ఇచ్చిన కంగనా...!

హృతిక్ తో వివాదంలో, పూర్తిగా వివాదాస్పదంగా మారిపోయింది కంగనా రనౌత్. ట్విట్టర్లో క్యారెక్టర్ లెస్ కంగనా అంటూ హ్యాష్ ట్యాగ్ రెండు మూడు రోజుల క్రితం ట్రెండ్ అయింది. ఆమెను క్యారెక్టర్ లేనిదని, క్షుద్రశక్తుల్నిపూజించేదని, వ్యభిచారి అని అనేక రకాలుగా నెటిజన్లు తిడుతున్నారు. వృత్తిపరంగా మంచి స్థాయికి చేరుకుంటున్న కంగనాను, ఈ వ్యక్తిగత వివాదాలు చాలా ఇబ్బంది పెడుతున్నా, ఆమె మాత్రం చాలా ధైర్యంగా ఉంది. తనను ఇష్టపడని వాళ్లందరికీ ఒక ఇంటర్వ్యూలో చెంపపెట్టులాంటి సమాధానమిచ్చింది కంగనా. " ఒక మహిళ ఫాస్ట్ గా ఉంటే, ఆమెను తప్పుడుదానిలా చూస్తారు. విజయాలను సాధిస్తుంటే సైకో అని, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే బరితెగించింది అని ముద్ర వేస్తారు. నేను ఏ తప్పు చేయలేదు. వేరొకరి గురించి భయపడటం నాకు అలవాటు లేదు. వృత్తి పరంగా సైకో పాత్రను, వ్యభిచారిణి పాత్రను కూడా వేశాను నేను. ఆ సమయంలో ప్రాస్టిట్యూట్ ల దగ్గరకు వెళ్లి వారి మనోవేదనను తెలుసుకున్నదాన్ని నేను. ఎవరైనా నన్ను  ఆ పేరుతో తిట్టి, విజయం సాధించామనుకంటే వాళ్ల మూర్ఖత్వమే అవుతుంది. ఒక చిన్న ఊరిలో మొదలైన నా ప్రయాణం, నేడు  జాతీయ అవార్డు గెలుచుకునే వరకూ సాగింది. నా విజయాలే విమర్శకులకు నా సమాధానం " అంటూ తనపై వస్తున్న విమర్శల్ని, తనను ద్వేషించే వాళ్లను తిప్పి కొట్టింది కంగనా. ఇంత ఇబ్బందుల్లో కూడా ఆమె ప్రదర్శిస్తున్న ధైర్యాన్ని, తెగువను మెచ్చుకుంటున్నారు చాలా మంది. త్వరలోనే కంగన, హృతిక్ విషయం ఒక కొలిక్కి వస్తుందని వీరిద్దరి అభిమానులు ఎదురుచూస్తున్నారు.