Read more!

English | Telugu

కందిరీగ, బాడీగార్డ్, సుప్రీం మూవీస్ ఖాతాలో

"కందిరీగ", "బాడీగార్డ్" సుప్రీం మూవీస్ ఖాతాలో జమయ్యాయని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై, చురుకైన యువహీరో రామ్ హీరోగా, హన్సిక మోత్వానీ హీరోయిన్ గా, సంతోష్ శ్రీనివాస్ అనే యువకుణ్ణి దర్శకుడిగా పరిచయం చేస్తూ, బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం"కందిరీగ". ఈ చిత్రం ఓవర్ సీస్ రిలీజ్ హక్కులనూ, అలాగే శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై, విక్టరీ వెంకటేష్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, "డాన్ శీను" ఫేం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో, బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం ఓవర్ సీస్ రిలీజ్ హక్కులనూ సుప్రీమ్ మూవీస్ సొంతం చేసుకుందని వినికిడి.

రామ్ హీరోగా నటిస్తున్న "కందిరీగ" చిత్రం జూన్ చివరి వారంలో కానీ, జూలై తొలి వారంలో కానీ విడుదలయ్యే అవకాశాలున్నాయి. వెంకటేష్ హీరోగా నటిస్తున్న చిత్రందసరా పర్వదినం సందర్భంగా విడుదలయ్యే అవకాశాలున్నాయి.