English | Telugu
ఆస్కార్ కు కామసూత్ర త్రీడి ఎంపిక
Updated : Dec 19, 2013
షెర్లిన్ చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం "కామసూత్ర త్రీడి ". ఈ చిత్రం ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్ ఎంట్రీ పోటీలో నిలిచింది. మూడు విభాగాల్లో ఈ చిత్రం పోటీకి నిలవడం విశేషం. దీంతో షెర్లిన్ చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా షెర్లిన్ మాట్లాడుతూ.. కామసూత్ర అనగానే చాలా మంది అదేదో వినకూడని పదం విన్నట్లుగా మోహం పెట్టేస్తారు. ఈ నేపథ్యంలో వచ్చే సినిమా అంటే కొంతమందికి చులకన భావం కూడా ఉంది. కానీ అలాంటి ఆలోచనలేమి పెట్టుకోకండి అని ధీమాగా చెప్తుంది. ఈ చిత్రం "బెస్ట్ మోషన్ పిక్చర్", "బెస్ట్ ఒరిజినల్ స్కోర్", "బెస్ట్ ఒరిజినల్ సాంగ్" విభాగాలకు ఎంపికయ్యింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో మొత్తం 75 పాటలు పోటీపడుతున్నాయి. అందులో 5 పాటలు ఈ చిత్రనివే కావడం విశేషం. రూపేష్ పౌల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సచిన్, రంజిత్ లు కలిసి సంగీతాన్ని అందించారు. వచ్చే నెల 16న అవార్డులకు నామినేట్ అయిన చిత్రాలను ప్రకటిస్తారు. మర్చి 3న ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది.