English | Telugu

ఈ ‘పటాస్‌’ పేలడం ఖాయమట

నందమూరి కళ్యాణ్ రామ్ తాజా చిత్రం ‘పటాస్‌’ బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే పేలవచ్చని సినీ విమర్శకులు అంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన హిట్ లేని కళ్యాణ్ రామ్ చేస్తోన్న మరో ప్రయత్నమే 'పటాస్‌’. రీసెంట్ గా రిలీజైన ఈ చిత్ర ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే పక్కా కమర్షియల్‌ ఫార్మాట్‌లో సినిమా రూపొందినట్లు ట్రెయిలర్‌ని చూస్తే అర్థమవుతోంది. కళ్యాణ్ రామ్ సినిమాల్లో ఇంతకు ముందు కామెడీకి అంత ప్లేస్ వుండేది కాదు కానీ, ఈ సారి మాత్రం కాస్త బాగానే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. జగటపాటి రామ్ గోపాల్, పికె గెటప్ లో ఎమ్ ఎస్ చేసిన చాలా చమక్కులే పేలాయి ట్రయిలర్ లో. దీంతో కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్‌ కొడ్తాననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మరి కళ్యాణ్ రామ్ పోలీస్‌ గెటప్‌లో, మాస్‌ రూట్‌లో చేస్తోన్న ప్రయత్నం ఏ మేరకు అతనికి సక్సెస్‌ ఇస్తుందో.!

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.