English | Telugu

కాంత నుండి లక్కీ భాస్కర్ లుక్ వచ్చింది

సీతారామం,మహానటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరోగా మారాడు దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan)రీసెంట్ గా 'లక్కీ భాస్కర్' తో భారీ విజయాన్ని అందుకున్న దుల్కర్ ప్రస్తుతం 'కాంత'(Kaantha)అనే ఒక భిన్నమైన కథతో కూడిన సినిమా చేస్తున్నాడు.పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ మూవీపై దుల్కర్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుండగా, మేకర్స్ తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ ని రిలీజ్ చేశారు.దుల్కర్ సీరియస్ లుక్ తో ఉండటంతో పాటు,పాత తరం సినిమాల్లో హీరోలు వేసుకునే కాస్ట్యూమ్ తో ఉన్న లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది.దీంతో మూవీలో దుల్కర్ క్యారక్టర్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలో ఏర్పడింది.

1950 వ నేపథ్యంలో జరిగే ఈ మూవీలో మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్ గా చేస్తుండగా,సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు.రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మాతలు కాగా, సెల్వమణి సెల్వరాజ్(Selvamani Selvaraj)దర్శకత్వాన్ని వహిస్తున్నాడు.ఝాను సంగీత దర్శకుడు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.