English | Telugu

రోల్ మార్చుకుంటున్న ప్ర‌శాంత్ నీల్‌

కేజీయ‌ఫ్ ఫ్రాంఛైజీ ఫేమ్‌, స‌లార్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ఇప్పుడు కాసేపు డైర‌క్ట‌ర్ హ్యాట్ ప‌క్క‌న పెట్టాల‌నుకుంటున్నారు. ఆయ‌న నెక్స్ట్ సినిమాకు మ‌రో రోల్‌ని సెల‌క్ట్ చేసుకుంటున్నారు. ఈ రోల్ కూడా ప్ర‌భాస్ న‌టిస్తున్న స‌లార్ సినిమా షూటింగ్ పూర్త‌య్యాకే యాక్సెప్ట్ చేయాల‌నుకుంటున్నారు. ఆ మ‌ధ్య కేజీయ‌ఫ్ సినిమా న్యూస్‌లో ఉన్నంత వ‌ర‌కూ ఆ సినిమాతో, ఆ త‌ర్వాత స‌లార్ చిత్రంతో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు కెప్టెన్ ప్ర‌శాంత్ నీల్‌. అయితే ఈ సారి వీటి రెండింటికీ మారుగా మ‌రో విష‌యంతో వార్త‌ల్లోకి ఎక్కారు ప్ర‌శాంత్‌నీల్‌. అది కూడా ఓ తెలుగు సినిమాకు సంబంధించి. పీరియ‌డ్ డ్రామాకి సంబంధించి. ఆ పీరియ‌డ్ డ్రామాకి స్క్రిప్ట్ రైట‌ర్‌గా ప‌నిచేస్తున్నార‌ట ప్ర‌శాంత్ నీల్‌. ప్రస్తుతం స‌ర్క్యుల‌ర్‌లో ఉన్న రూమ‌ర్‌లో నిజానిజాలేంట‌నేది ఇంకా తెలియాల్సి ఉంది. అది నిజ‌మే అయినా, స్క్రీన్ రైట‌ర్‌గా ఆయ‌న ప‌నిచేయ‌డం ఇదేం తొలిసారి కాదు. ఆల్రెడీ ఆయ‌న ఓ క‌న్న‌డ సినిమాకు స్క్రీన్ రైట‌ర్‌గా ప‌నిచేశారు.

కేవ‌లం పీరియ‌డ్ డ్రామానే కాదు, హెవీ యాక్ష‌న్ కూడా ఉండ‌టంతో వెంట‌నే ఒప్పుకున్నార‌ట ప్ర‌శాంత్ నీల్‌. అందులోనూ ఆ చిత్రం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో సాగుతుంద‌ని వినికిడి. ఈ సినిమాలో విజ‌య్ కిర‌గందూర్ కీ రోల్ చేస్తున్నార‌ట‌. విజ‌య్ ఆల్రెడీ స‌లార్ సినిమాలో కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. ప్ర‌శాంత్ నీల్ రాసే పీరియ‌డ్ డ్రామాకి శ్రీనివాస్ గ‌విరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ట‌. ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న స‌లార్ షూటింగ్ ఇప్పుడు ఫైన‌ల్ స్టేజ్‌లో ఉంది. ఈ సెప్టెంబ‌ర్‌లో రిలీజ్‌కి రెడీ అవుతోంది స‌లార్‌. ఆల్రెడీ రాధేశ్యామ్‌, ఆదిపురుష్ అట్ట‌ర్ ఫ్లాప్ కావ‌డంతో ఆశ‌ల‌న్నీ స‌లార్ మీదే పెట్టుకున్నారు ప్ర‌భాస్‌.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.