English | Telugu

'జటాధర' ట్రైలర్.. సుధీర్ బాబు విశ్వరూపం!

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'జటాధర'. ఎస్ కే జీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. (Jatadhara Trailer)

'జటాధర' ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. మూడు నిమిషాల నిడివితో రూపొందిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. గుప్తనిధుల అంశాన్ని ముడిపెడుతూ.. దైవ శక్తికి, పిశాచానికి మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉంది. "పూర్వం ధనాన్ని భూమిలో దాచిపెట్టి.. మంత్రాలతో బంధనాలు వేసేవారు. ఆ బంధనాలలో అతి భయంకరమైనది పిశాచ బంధనం" అనే వాయిస్ తో ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. దెయ్యాలను నమ్మని ఘోస్ట్ హంటర్ గా సుధీర్ బాబు కనిపిస్తున్నాడు. లంకె బిందెలకు కాపలాగా ఉండే ధన పిశాచిగా సోనాక్షి సిన్హా కనిపిస్తోంది. దెయ్యాలను నమ్మని హీరో.. ధన పిశాచితో తలపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? శివుడి ఆశీస్సులతో హీరో ఎలా పోరాడాడు? అనే ఆసక్తిని కలిగిస్తూ ట్రైలర్ ను రూపొందించారు. ఇక ట్రైలర్ చివరిలో నేల మీద పడుకొని రక్తం తాగుతున్నట్టుగా సుధీర్ బాబు పాత్రని చూపించడం సర్ ప్రైజింగ్ ఉంది. మొత్తానికి ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. విజువల్ గా కూడా బాగానే ఉంది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.