English | Telugu

జానీ మాస్టర్ కి బెయిల్ 

తోటి డాన్సర్ పై లైంగిక వేధింపుల కేసులో పోక్సో యాక్ట్‌ నమోదు కావడంతో జానీ మాస్టర్(jani master)రెండు వారాలుగా చంచల్ గూడ జైలులో ఉన్న విషయం తెలిసిందే.కొన్ని రోజుల క్రితం ధనుష్ హీరోగా వచ్చిన తిరు లోని మేఘం కురిసింది పాటకి జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు వచ్చింది. దీంతో అవార్డు అందుకోవడానికి ఢిల్లీ వెళ్లాలని బెయిల్ కోరుతూ జానీ మాస్టర్ పిటిషన్ వేసాడు. కోర్టు అందుకు సమ్మతించి బెయిల్ మంజూరు చేసింది. కానీ అవార్డు కమిటీ జానీ మాస్టర్ పై వస్తున్న లైంగిక ఆరోపణల దృష్ట్యా అవార్డుని నిలిపి వేసింది.

దీంతో జానీ మాస్టర్ త‌న బెయిల్‌ను ర‌ద్దు చేసుకుని జైలుకు వెళ్ళాడు. మళ్ళీ వెంట‌నే బెయిల్ కోసం మ‌రోసారి అప్పీల్ చేయ‌గా కేసు విచారణలో ఉన్న దృష్ట్యా బెయిల్ ఇవ్వలేమని కోర్టు బెయిల్ పిటిషన్ ని కొట్టివేసింది.కానీ ఇప్పుడు రీసెంట్ గా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు దేశం ధాటి వెళ్లకూడదని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది.


రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.