English | Telugu
కియారా కంటే ఎక్కువ.. దీపికా కంటే తక్కువ!
Updated : Mar 7, 2023
ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న పలు పాన్ ఇండియా సినిమాల్లో బాలీవుడ్ భామలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'RC 15'లో రామ్ చరణ్ కి జోడిగా కియారా అద్వానీ నటిస్తుండగా.. 'ప్రాజెక్ట్ కె'లో ప్రభాస్ సరసన దీపికా పడుకోణె నటిస్తోంది. ఇక 'ఎన్టీఆర్ 30'లో యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ నటిస్తోంది. అయితే ఇప్పుడు ఈ మూడు సినిమాలకు ఈ బాలీవుడ్ బ్యూటీలు తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఆసక్తికరంగా మారింది.
'RC 15'కి కియారా అద్వానీ రూ.3.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కియారా అద్వానీకి టాలీవుడ్ కొత్తకాదు. గతంలో ఆమె 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి తెలుగులో నటిస్తోంది. పైగా ఇది భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా ఫిల్మ్. ఈ సినిమా హిట్ అయితే కియారా స్టార్డమ్ అమాంతం పెరిగే అవకాశముంది. అందుకే రెమ్యునరేషన్ విషయంలో ఆమె పెద్దగా డిమాండ్ చేయలేదని వినికిడి.
ఇక దీపికా ఎప్పుడో పెద్ద స్టార్. ఆమెకు కేవలం హిందీలోనే కాకుండా నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు ఉంది. దానికి తగ్గట్లే ఆమె రెమ్యునరేషన్ కూడా భారీగా ఉంటుంది. 'ప్రాజెక్ట్ కె' కోసం ఆమె ఏకంగా రూ.15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. జాన్వీ కపూర్ విషయానికొస్తే తన గ్లామర్ తో ఆమె నేషనల్ వైడ్ గా యూత్ కి బాగా దగ్గరైంది. ఆమె తెలుగులో మొదటి సినిమాకే జూనియర్ ఎన్టీఆర్ సరసన 'ఎన్టీఆర్ 30'లో నటించే అవకాశం దక్కించుకుంది. హిందీ సినిమాలకు మూడు నుంచి నాలుగు కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే జాన్వీ.. ఇప్పుడు ఈ పాన్ ఇండియా మూవీ కోసం ఏకంగా ఐదు కోట్లు తీసుకుంటున్నట్లు టాక్. అంటే జాన్వీ రెమ్యునరేషన్.. కియారా కంటే ఎక్కువ, దీపికా కంటే తక్కువ అన్నమాట.