English | Telugu
500 కోట్ల క్లబ్ లో 'జైలర్'.. లాభం రూ. 100 కోట్ల పైమాటే!
Updated : Aug 21, 2023
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త చిత్రం 'జైలర్' ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ సినిమా.. రూ. 500 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరి మరోసారి వార్తల్లో నిలిచింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. ఆగస్టు 10న జనం ముందు నిలిచింది. తొలి ఆట నుంచే మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. విడుదలైన ప్రతీ చోట కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఆదివారంతో 11 రోజుల ప్రదర్శన చేసుకున్న ఈ సెన్సేషనల్ మూవీ.. ఇప్పటివరకు రూ. 103 కోట్లకి పైగా లాభాలు ఆర్జించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆదివారంతో రూ. 69.60కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసింది.
'జైలర్' 11 రోజుల కలెక్షన్స్ వివరాలు:
తమిళనాడు – రూ. 148.80 కోట్ల గ్రాస్
తెలుగు రాష్ట్రాలు - రూ. 69.60 కోట్ల గ్రాస్ (తమిళ వెర్షన్ తో కలిపి)
కర్ణాటక- రూ. 58.80 కోట్ల గ్రాస్
కేరళ – రూ. 45.90 కోట్ల గ్రాస్
రెస్టాఫ్ ఇండియా – రూ. 11.90 కోట్ల గ్రాస్
ఓవర్సీస్ – రూ. 170.40 కోట్ల గ్రాస్
ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల కలెక్షన్స్ – రూ. 505.40 కోట్ల గ్రాస్ (రూ. 247.45 కోట్ల షేర్)