English | Telugu
భార్య అంటే మన ప్రాణాన్ని కాపాడే ఆరోప్రాణం...
Updated : Feb 17, 2023
వాలెంటైన్స్ డే సందర్భంగా రీసెంట్ గా జీ తెలుగులో ప్రసారమైన "ఓ రెండు ప్రేమ మేఘాలు" ఎపిసోడ్ లో రీల్ జంటలు, రియల్ జంటలు, సింగిల్స్ ఇలా క్యాటగిరీ వైజ్ గా ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. ఇందులో రియల్ జోడీస్ కి ఒక పోటీ పెట్టగా అందులో రచ్చ రవి-స్వాతి జోడి, మై విల్లెజ్ షో అనిల్ జోడి విన్ అయ్యారు.. రచ్చ రవి తన లైఫ్ గురించి అందులో పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. ముందుగా వాళ్ళ పెళ్లి విషయం గురించి, తన భార్య పిల్లల్ని కన్న ఆస్పత్రి...మొదటి తిరిగిన బైక్, కార్, ఇప్పుడు కొన్న కార్, అద్దె ఇంట్లోంచి, సొంత ఇంట్లోకి ఎలా వెళ్లారు అనే విషయాలను ఒక ఏవి ద్వారా చెప్పాడు. "మేము అద్దె ఇంట్లో ఉన్నప్పుడు దొంగలు గ్యాస్ సిలిండర్ తో సహా అన్నీ పట్టుకెళ్ళిపోయారు. అప్పటికి నా దగ్గర డబ్బులు లేవు..ఏమీ లేవు..నా వైఫ్ టీచింగ్ చేసింది, టైలరింగ్ చేసి ఆ డబ్బులు నాకు ఇచ్చింది.
ప్రపంచం నాకు ఏమిచ్చింది అని కాకుండా నాకు ప్రపంచం ఏమిచ్చింది అంటూ ఏరుకుంటూ తిరిగాను..అందులో స్వాతిని, సినిమాను, ఈ స్టేజిని ఏరుకున్నా. అందులో నన్ను వంద శాతం అర్ధం చేసుకున్నది స్వాతి మాత్రమే..భార్యను ప్రేమిస్తే బాధ్యతగా అసలు ఫీల్ అవ్వకూడదు...నువ్వు ఒక భరోసాను ఇవ్వు.. అన్నగా, తండ్రిగా, ఫ్రెండ్ గా, కొడుకుగా మారు..అంతే వాళ్ళే చూసుకుంటారు నీ జీవితాన్ని, నిన్ను...పెళ్ళాం అంటే మన బాధ్యత కాదు..పెళ్ళాం అంటే మన ప్రాణాన్ని కాపాడే ఆరోప్రాణం " అంటూ భార్య గురించి సరికొత్తగా నిర్వచనం ఇచ్చాడు రచ్చ రవి.