English | Telugu
జాట్ ట్రైలర్ అదుర్స్..తెలుగు వాడి సత్తా చాటి చెప్పారు
Updated : Mar 25, 2025
భారతీయ సినీ ప్రేమికులకి బాలీవుడ్ స్టార్ హీరో సన్నీడియోల్(Sunny deol)గురించి ప్రత్యేక పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు.1983 లో వచ్చిన బేతాబ్ తో ఎంట్రీ ఇచ్చిన సన్నీ డియోల్ నేటికీ తన అధ్బుతమైన నటనతో అభిమానులని,ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాడు.కొంత గ్యాప్ తీసుకొని 2023 లో 'గదర్ 2(Gadar 2)తో వచ్చి కలెక్షన్ల సునామీని సృష్టించాడు.60 కోట్లతో నిర్మిస్తే 690 కోట్ల దాకా వసూలు చేసింది.
ఇప్పుడు మరోసారి ఏప్రిల్ 10 న తన కొత్త మూవీ'జాట్' తో మరోసారి తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాడు.పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఎక్కువ భాగం మన తెలుగు టెక్నీషయన్స్ పని చేస్తున్నారు.క్రాక్,వీరసింహారెడ్డి ఫేమ్ గోపిచంద్ మలినేని(Gopichandh malineni)దర్శకుడు కాగా మైత్రి మూవీ మేకర్స్,పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ వ్యయంతో నిర్మించాయి.థమన్(Thaman)సంగీతాన్ని,నవీన్ నూలి ఎడిటర్ గా పని చేస్తున్నారు.ఈ విధంగా హిందీ చిత్ర సీమలో తెలుగు వాడి గొప్పతనాన్ని చాటి చెప్తున్నారు.ఆర్టిసుల పరంగాను జగపతి బాబు,రమ్య కృష్ణ కీలకపాత్రల్లో చేస్తుండగా,తెలుగు సినిమాల ద్వారా గుర్తింపు పొందిన రెజీనా హీరోయిన్ గా బాలీవుడ్ లో తన సత్తా చాటడానికి సిద్దమవుతుంది.అజయ్ ఘోష్ కూడా కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.
ఇక ట్రైలర్ గురించి అయితే ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది.యాక్షన్ సినిమాలని ఇష్టపడే సినీ ప్రియులకి ఫుల్ మీల్స్ గ్యారంటీ అనే విషయం మాత్రం చాలా క్లియర్ గా అర్ధమవుతుంది.పోరాట దృశ్యాలని కూడా సరికొత్తగా డిజైన్ చేసినట్టుగా ఉన్నారు.రణదీప్ హుడా ప్రతినాయకుడుగా చేస్తుండగా వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్,జరీనా వాహబ్, ఉపేంద్ర లిమాయె తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు.