English | Telugu

'రాబిన్ హుడ్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఇది అసలు ఊహించలేదు!

'భీష్మ' తర్వాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'రాబిన్ హుడ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ కామెడీ ఫిల్మ్ లో శ్రీలీల హీరోయిన్. మార్చి 28న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. 'భీష్మ' తర్వాత సరైన సక్సెస్ కోసం చూస్తున్న నితిన్.. 'రాబిన్ హుడ్'తో కమ్ బ్యాక్ ఇస్తాడనే అభిప్రాయాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా సెన్సార్ టాక్ పాజిటివ్ గా ఉంది. (Robinhood)

'రాబిన్ హుడ్' మూవీ తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఫైనల్ రన్ టైం 2 గంటల 26 నిమిషాలకు లాక్ అయింది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి U/A స‌ర్టిఫికెట్‌ ఇచ్చారు. 'రాబిన్ హుడ్' సెన్సార్ టాక్ పాజిటివ్ గానే ఉంది. ఫస్ట్ హాఫ్ లో నితిన్-శ్రీలీల లవ్ ట్రాక్ బాగుందట. అలాగే వెన్నెల కిషోర్‌, రాజేంద్ర ప్ర‌సాద్ కామెడీ కూడా బాగా వర్కౌట్ అయిందట. ఫస్ట్ హాఫ్ లో బాగా నవ్వించిన రాబిన్ హుడ్.. సెకండ్ హాఫ్ లో కామెడీతో పాటు స్టైలిష్ ఫైట్స్, ఎమోష‌న‌ల్ సీన్స్ తో సర్ ప్రైజ్ చేసిందట. ఇక క్లైమాక్స్ లో డేవిడ్ వార్నర్ ఎంట్రీ అదిరిపోయిందని అంటున్నారు. నితిన్, శ్రీలీల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందట. నితిన్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ ఈ సినిమాకి ప్లస్ అని, శ్రీలీల పాత్ర కూడా ఆమె గత చిత్రాలకు భిన్నంగా కొత్తగా ఉందని చెబుతున్నారు. మొత్తానికి లవ్, కామెడీ, యాక్షన్, ఎమోషన్, ట్విస్ట్ లతో ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ ఫిల్మ్ ని వెంకీ కుడుముల అందించాడని ఇన్ సైడ్ టాక్.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.