English | Telugu

విక్ర‌మ్‌కి బుద్దొచ్చింది

ఐ కోసం రెండేళ్లు క‌ష్ట‌ప‌డ్డాడు విక్ర‌మ్‌. ఈసినిమా కోసం ఒళ్లు హూనం చేసుకొన్నాడు. కేవ‌లం శంక‌ర్‌ని న‌మ్మి.. ఈ రెండేళ్ల‌లో మ‌రే సినిమా ఒప్పుకోలేదు. దానికి త‌గిన మూల్యం చెల్లించుకొన్నాడు. ఐ సినిమా ఫ్లాప్ అయ్యింది. మేక‌ప్‌ల ముసుగులో విక్ర‌మ్ క‌ష్టం.. బూడిద‌లో పోసిన ప‌న్నీర‌య్యింది. ఈ ఒక్క సినిమా.. విక్ర‌మ్ ఆలోచ‌నా విధానాన్నే మార్చేసింది. రెండేళ్ల‌కు ఓ సినిమా తీసుకొంటూ పోతే.. కుద‌ర‌ద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చేశాడు విక్ర‌మ్‌. ఒక్క సినిమాని న‌మ్ముకోవ‌డం కంటే యేడాదికి రెండు మూడు సినిమాలు పూర్తిచేయ‌డం బెట‌ర్ అనుకొంటున్నాడిప్పుడు. అందుకే సినిమా మీద సినిమా ఒప్పుకొంటున్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న చేతిలో రెండు సినిమాలున్నాయి.


ప్ర‌స్తుతం పత్తు ఎండ్రత్తుక్కలే చిత్రంలో న‌టిస్తున్నాడు విక్ర‌మ్‌. వీటితో పాటు ద‌ర్శ‌కుడు ఆనంద్ శంకర్ క‌థ‌కీ ఓకే చెప్పాడు. మ‌రో చిన్న సినిమాపైనా సంత‌కాలు చేశాడ‌ట‌. అంటే... ఒక్క‌సారిగా మూడు చిత్రాలు త‌న చేతిలో ఉన్నాయి. అంతేకాదు... నా కోసం ప్ర‌యోగాత్మ‌క క‌థ‌లు రాసుకోకండి.. అంటూ ద‌ర్శ‌కులకు క్లియ‌ర్‌గా చెప్పేశాడ‌ట‌. పూర్తిగా క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల్లోనే న‌టిస్తాన‌ని, కొన్నాళ్ల పాటు ప్ర‌యోగం జోలికిపోన‌ని... గ‌ట్టిగా చెబుతున్నాడట‌. ఐ ఎఫెక్ట్ అంత స్ట్రాంగ్ గా ప‌డింది మ‌రి.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.