English | Telugu

పవన్ కళ్యాణ్ కి హీరో కార్తీ క్షమాపణలు!

తాజాగా జరిగిన 'సత్యం సుందరం' మూవీ ఈవెంట్ లో యాంకర్ "లడ్డు కావాలా నాయనా..?" అనగా.. హీరో కార్తీ (Karthi) "ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు. సెన్సిటివ్ టాపిక్ అది. మనకొద్దు." అన్నాడు. 

అయితే కార్తీ చేసిన కామెంట్స్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అసహనం వ్యక్తం చేశారు. "ఫిల్మ్ ఇండస్ట్రీకి నేను ఒకటి తెలియజేస్తున్నా. లడ్డు వివాదం గురించి మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేదా మౌనంగా కూర్చోండి. అపహాస్యం చేసే మాత్రం ప్రజలు మిమ్మల్ని క్షమించరు. లడ్డు మీద మీరు జోకులేస్తున్నారు. నిన్న ఒక సినిమా ఫంక్షన్ లో చూశాను. లడ్డు అనేది సెన్సిటివ్ టాపిక్ అని మాట్లాడారు. ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. నటులుగా మీరంటే నాకు గౌరవం ఉంది. కానీ సనాతన ధర్మం గురించి మాట్లాడేముందు ఒకటికి వంద సార్లు ఆలోచించి మాట్లాడండి" అని పవన్ కళ్యాణ్ అన్నారు.

తన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేయడంతో.. సోషల్ మీడియా వేదికగా స్పందించిన కార్తీ.. క్షమాపణలు తెలిపాడు. పవన్ కళ్యాణ్ గారు, ఏదైనా అనుకోని అపార్థం ఏర్పడితే, మీ మీద ఉన్న అపారమైన గౌరవంతో క్షమాపణలు కోరుతున్నాను. వెంకటేశ్వర స్వామి వినయపూర్వకమైన భక్తుడిగా, నేను ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తాను." అని కార్తీ ట్వీట్ చేశాడు.