English | Telugu
‘దేవర’ టీమ్‌పై, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై ‘జానుపాప’ ఆసక్తికర కామెంట్స్!
Updated : Sep 24, 2024
ఎన్టీఆర్, కొరటాల శివ లేటెస్ట్ సెన్సేషన్ ‘దేవర’. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ద్వారా అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటల్లో జాన్వీ తన అంద చందాలతో, అభినయంతో ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. శ్రీదేవి కూతురుగానే కాదు, ఒక అందమైన హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులు, ఎన్టీఆర్ అభిమానులు జాన్వీని ఆహ్వానిస్తున్నారు. ఆమెను ముద్దుగా ‘జానుపాప’ అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పిలుచుకుంటున్నారు. తెలుగు ప్రేక్షకులు, ఎన్టీఆర్ అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓ స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు జాన్వీ కపూర్.
ఆ వీడియోలో ‘దేవర’ హీరోయిన్ ఏమందంటే.. ‘నన్ను స్వాగతించిన తెలుగు ప్రేక్షకులకు, నన్ను జాను పాప అంటూ ప్రేమగా పిలుస్తున్న ఎన్టీఆర్ సర్ ఫ్యాన్స్‌కి ధన్యవాదాలు. నన్ను మీ సొంత మనిషిగా ఫీల్ అవ్వడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు. అలాగే అమ్మకి కూడా మీరు అంతే ముఖ్యం. అలాగే నాకు కూడా. మీరంతా నన్ను ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే నేను ప్రతిరోజూ కష్టపడతాను. టాలీవుడ్‌లో ‘దేవర’ నా ఫస్ట్ స్టెప్. శివ సర్, ఎన్టీఆర్ సర్ నన్ను ఎంపిక చేసుకోవడం నా అదృష్టం. మా ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ సినిమా షూటింగ్ సమయంలో నాకు హెల్ప్ చేసిన దేవర టీమ్‌లోని ప్రతి ఒక్కరికీ థాంక్స్’ అన్నారు ‘దేవర’ బ్యూటీ జాన్వీ కపూర్.