English | Telugu

హైకోర్టు జడ్జి కుమారుడిపై దాడి.. నటుడు దర్శన్‌ అరెస్ట్‌!

ఇటీవల సినిమా పరిశ్రమలో నేరాలు, ఘోరాలు ఎక్కువైపోయాయి. రకరకాల వివాదాలు సినీ ప్రముఖుల్ని చుట్టుముడుతున్నాయి. అలా తమిళ పరిశ్రమలో ఒక దారుణం చోటు చేసుకుంది. తమిళనాడు హైకోర్టు జడ్జి కుమారుడు ఆత్తిచుడి, ఆయన అత్త మహేశ్వరిపై తమిళ నటుడు దర్శన్‌ దాడి చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్శన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. చెన్నయ్‌లోని ముగప్పేర్‌లో దర్శన్‌ నివాసం ఉంటున్నాడు. అతని ఇంటి ముందు ఒక టీ స్టాల్‌ ఉంది. అక్కడికి టీ తాగేందుకు వచ్చే వారి వాహనాల పార్కింగ్‌ విషయంలో తరచూ గొడవ జరుగుతూనే ఉంటుంది.

ఇటీవల తమిళనాడు హైకోర్టు జడ్జి కుమారుడు ఆత్తిచుడి, అతని అత్త మహేశ్వరి, మరి కొందరు టీ తాగేందుకు అక్కడికి వచ్చారు. దర్శన్‌ ఇంటి ముందు కారును పార్క్‌ చేయడంతో దాన్ని తియ్యాల్సిందిగా దర్శన్‌ అడిగాడు. మెల్లగా మొదలైన ఈ వివాదం ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఆ క్రమంలోనే మహేశ్వరికి కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆత్తిచుడి, మహేశ్వరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్శన్‌, అతని సోదరుడు లోకేశ్‌లను అరెస్ట్‌ చేశారు. దర్శన్‌ కూడా ఆత్తిచుడి, ఆయన భార్య, అత్తపైన కూడా ఫిర్యాదు చేశాడు. పోలీసులు వారిపై కూడా కేసు నమోదు చేశారు. విజయ్‌ టీవీలో ప్రసారమైన బిగ్‌బాస్‌ సీజన్‌-3 ద్వారా నటుడు దర్శన్‌ పేరు వెలుగులోకి వచ్చింది. ‘గూగుల్‌ కట్టప్ప’ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు దర్శన్‌. వాస్తవానికి అతను శ్రీలంకకు చెందినవాడు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.