English | Telugu

100 కోట్ల బడ్జెట్‌తో జయం రవి చిత్రం

నటుడు జయం రవి నెక్స్ట్ సినిమా 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ఎన్‌. కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో నటించడానికి జయం రవి ఓకే చెప్పారు. ఇప్పటిదాకా తన కెరీర్‌లో చేయనటువంటి పాత్రలో చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు జయం రవి. ఎప్పటికప్పుడు కొత్త దర్శకులతో, సరికొత్త స్క్రిప్ట్ లతో పనిచేయడం జయం రవికి బాగా అలవాటైన విషయం. అందుకే జయాపజయాలు తనని ఇబ్బందిపెట్టవని అంటారు రవి. 

 జయం రవి నటించిన లాస్ట్ మూవీ అఖిలన్‌. మార్చి 10న విడుదలైంది. శ్యామ్‌.సి.యస్‌ సంగీత దర్శకత్వం వహించారు. ఇప్పటికీ చాలా మంచి స్పందన వస్తోంది పాటలకు. కానీ సినిమాకు పెద్దగా గుడ్‌ రివ్యూస్‌ రాలేదు. ఈ ఏడాది విడుదలైన అఖిలన్‌ విషయంలో జయం రవి అసంతృప్తితో ఉన్నారు. 

ఆయన నటించిన పొన్నియిన్‌ సెల్వన్‌ 2 ఏప్రిల్‌ 28న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు జయం రవి. లాస్ట్ ఇయర్‌ రిలీజ్‌ అయిన పీయస్‌1కి కూడా మంచి స్పందన వచ్చింది. మణిరత్నం దర్శకత్వంలో నటించారు జయం రవి.  పొన్నియిన్‌ సెల్వన్‌2 తర్వాత అహ్మద్‌ దర్శకత్వంలో ఇరైవన్‌, ఆంటని భాగ్యరాజ్‌ దర్శకత్వంలో సైరన్‌ సినిమాల్లో నటించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీటన్నిటినీ పూర్తి చేశాక జయం రవి నటించే 32వ సినిమా 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనుంది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మిస్తోంది. ఐసరి గణేష్‌ నిర్మించనున్నారు. 

వంద కోట్ల బడ్జెట్‌తో సినిమా చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. జయం రవి మీద మాకు ఆ మాత్రం నమ్మకం ఉంది అని అంటున్నారు నిర్మాత. ఎ.ఆర్‌.రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్నారు. 10 భాషలకు పైగా ఈ సినిమా తెరకెక్కనుంది. 100 కోట్ల బడ్జెట్‌ సినిమాకు ఫస్ట్ టైమ్‌ డైరక్టర్‌ కల్యాణ్‌ కృష్ణని సెలక్ట్ చేసుకున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.