English | Telugu

'హరి హర వీరమల్లు' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఆ రోజు వైజాగ్ లో రచ్చ రచ్చే!

జూలై 24న 'హరి హర వీరమల్లు' చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు వీరమల్లు సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని సెన్సార్ సభ్యులు ప్రశంసించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే, విజువల్స్ బాగున్నాయని మెచ్చుకున్నట్లు సమాచారం. ఈ చిత్ర నిడివి 2 గంటల 42 నిమిషాలు. సెన్సార్ నుంచి పాజిటివ్ టాక్ రావడం, క్రిస్పీ ర‌న్ టైమ్ కావడంతో.. వీరమల్లు చిత్రం బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయడం ఖాయమని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

విడుదలకు పది రోజులే ఉండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది. జూలై 20న వైజాగ్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. నిజానికి తిరుపతి లేదా విజయవాడలో ఈవెంట్ ఉంటుందని మొదట వార్తలొచ్చాయి. ఆ రెండు కాకుండా.. అనూహ్యంగా వైజాగ్ వేదిక కానుంది.

'హరి హర వీరమల్లు' చిత్రాన్ని ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మించారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకులు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.