English | Telugu

చరణ్ 'గోవిందుడు..' టీజర్ వచ్చేస్తోంది

గత కొంతకాలంగా మెగా అభిమానులు ఎదురుచూస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ టీజర్ విడుదల కాబోతుంది. ఆగస్ట్ 7వ తేది సాయంత్రం ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నట్లు బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ ప్రకటించాడు. నిజానికి ఈ టీజర్ దర్శకుడు కృష్ణ వంశీ బర్త్ డే రోజున విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని అనుకొని కారణాల వల్ల టీజర్ రిలీజ్ వాయిదా పడింది. కుటుంబ కథ చిత్రంలో మొదటి సారి నటిస్తున్న రామ్ చరణ్ ని కృష్ణ వంశీ ఎలా చూపించూపించబోతున్నడోనని అభిమానులు ఆత్రుతగా వున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, జయసుధ, కమలిని ముఖర్జీ, ఆదర్శ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.