English | Telugu

"గోవింద గానామృతం" ఆడియో రిలీజ్

"గోవింద గానామృతం" ఆడియో రిలీజ్ అయ్యింది. వివరాల్లోకి వెళితే గతంలో "చెలియా" అనే ఆల్బమ్ ని తయారుచేసిన యువ సంగీత దర్శకుడు రాజీవ్ తన మలి ప్రయత్నంగా "గోవింద గానామృతం" అనే భక్తిరస గీతాల సి.డి.ని తయారుచేశారు. జనవరి 5 వ తేదీన, ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా, ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా ప్రముఖ సినీ దర్శకుడు వి.యన్.ఆదిత్య అందుకోగా ఈ "గోవింద గానామృతం" భక్తి సి.డి. మార్కెట్లోకి విడుదల చేయబడింది.

ఈ "గోవింద గానామృతం" ఆడియో విడుదలకు ప్రముఖ దర్శకులు మధుర శ్రీధర్ రెడ్డి, ప్రముఖ సినీ గీత రచయిత సిరాశ్రీ తదితరులు హాజరయ్యారు. రాజీవ్ చేసిన ఈ "గోవింద గానామృతం" చాలా బాగుందనీ, అతను భవిష్యత్తులో మంచి సినీ సంగీత దర్శకుడై రాణించాలనీ ఆహూతులంతా ఆకాంక్షించారు.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.