English | Telugu

ప‌వన్ ఎప్పుడొచ్చేదీ తెలిసింది!

ప‌వన్‌, వెంకీల మ‌ల్టీస్టార‌ర్ తుది మెరుగులు దిద్దుకొంటోంది. విడుద‌ల‌కు రెడీ అవుతున్న కొద్దీ.. ఈసినిమా గురించిన ఆస‌క్తి క‌ర‌మైన విష‌యాలు ఒక్కొక్క‌టీ బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఈ సినిమాలో ప‌వ‌న్ ఎప్పుడు వ‌స్తాడు? ఎంత సేపు క‌నిస్తాడు? అనే ఆస‌క్తిక‌ర‌మైన‌ చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ విష‌యంలో ఓ క్లూ దొరికింది. గోపాల గోపాల లో ప‌వ‌న్ రాక‌తో విశ్రాంతి కార్డు ప‌డుతుంద‌ట‌. వెంక‌టేష్ ని ప‌వ‌న్ కాపాడే స‌న్నివేశంతో గోపాల గోపాల ఫ‌స్ట్ ఆఫ్ పూర్త‌వుతుంది. సెకండాఫ్ మొత్తం ప‌వ‌న్ చుట్టూనే క‌ధ తిరుగుతుంద‌ట‌. ప‌వ‌న్, వెంకీల‌పై ఓ గీతం కూడా సెకండాప్‌లో చూపిస్తార‌ట‌. ఏ సినిమాకైనా ద్వితియార్థం కీల‌కం. ఈ సినిమాలో ప‌వ‌న్‌తో సెకండాప్ దిగ్విజంగా న‌డిపించి అభిమానుల్ని అల‌రించ‌బోతోంది చిత్ర‌బృందం. ఓ మైగాడ్‌లో మంచి డైలాగుల‌న్నీ ప‌రేష్ రావ‌ల్ చేతే ప‌లికించారు. అయితే ఈసినిమాలో ప‌వ‌న్ కి అధిక‌భాగం అప్ప‌గించార‌ట‌. ప‌వ‌న్ చెప్పే ఒకొక్క డైలాగ్... అభిమానుల‌తో కేరింత‌లు కొట్టించేలా ఉంటుంద‌ని ఇన్ సైడ్ టాక్‌.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.