English | Telugu
'గీత శంకరం' మూవీ హీరోగా రిషి సర్
Updated : Nov 12, 2023
బుల్లితెర మీద సీరియల్స్ లో నటించి, కామెడీ షోస్ లో నటించి ఎంతో పేరు తెచ్చుకున్న వాళ్ళు సిల్వర్ స్క్రీన్ మీదకు కూడా వెళ్లి మంచి మంచి రోల్స్ లో నటిస్తున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు రిషి సర్ వంతు వచ్చింది. గుప్పెడంత మనసు సీరియల్ నటుడు రిషి సర్ అలియాస్ ముఖేష్ గౌడకి ఎంత మంది లేడీ ఫాన్స్ ఉన్నారో చెప్పక్కర్లేదు. సీరియల్ లో రిషి సర్ ఆటిట్యూడ్ కి యూత్ ఫాన్స్ కూడా చాలా ఎక్కువమంది ఉన్నారు. ఈయన కన్నడకు చెందిన వ్యక్తి అయినప్పటికీ తెలుగులో ఈ సీరియల్స్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఈయన నటించిన గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఫుల్ ఫేమస్ అయ్యాడు. అలాంటి యంగ్ హీరోకి ఇప్పుడు ఫస్ట్ మూవీ ఛాన్స్ వచ్చింది. ఆ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.
ప్రియాంక శర్మ, ముఖేష్ గౌడ హీరో హీరోయిన్స్ గా " గీతా శంకరం" అనే మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇందులో భాగంగా పచ్చని పొలాల మధ్య హీరో హీరోయిన్ ఇద్దరు బైక్ పై వెళ్తున్నట్టు చూపించారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ పై ముఖేష్ గౌడ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. బుల్లితెరపై తనను ఎంతగా ఆదరించారో అలాగే రాబోయే మూవీని కూడా ఆడియన్స్ అంతా చూడాలని కోరారు. ఇక తనకు ఇలా సినిమాలలో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. ప్రేమకథ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీ ఈ నెల 14 నుండి షూటింగ్ పనులు జరుగుతాయంటూ ప్రకటించారు చిత్రయూనిట్. అచ్చమైన విలేజ్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అవుతుందని ముఖేష్ గౌడ స్పష్టం చేశారు.
ఇప్పటికే సుడిగాలి సుధీర్ బుల్లితెర నుంచి వెళ్లి హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు... అలాగే వేణు వండర్స్ డైరెక్టర్ గా బలగం మూవీ తీసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక రౌడీ రోహిణి బుల్లితెర నుంచి అటు సిల్వర్ స్క్రీన్ మీద కూడా కామెడీ రోల్స్ చేస్తూ దూసుకుపోతోంది. ఇలా రష్మీ, అనసూయ ఇలా ఎంతో మంది సిల్వర్ స్క్రీన్ మీద తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.