English | Telugu

అలా చేసి పెట్టమని రామ్ చరణ్ ని కోరుతున్న అభిమానులు 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం అవ్వగానే ప్రతి ఒక్క మెగా ఫ్యాన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.శంకర్ దర్శకత్వంలో స్క్రీన్ మీద రామ్ చరణ్ ప్రెజంటేషన్ ని చూడాలని మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తు ఉన్నారు. అలాగే షూటింగ్ కూడా త్వరగా కంప్లీట్ చేసుకోవాలని తమ తమ ఇష్ట దైవాలని ప్రార్థిస్తున్నారు.కానీ వాళ్ళ కోరిక ఇప్పుడప్పుడే తీరేలా కనిపించటం లేదు.

గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి సంవత్సరంన్నర పైనే అవుతుంది. ఈ సంవత్సరంన్నరలో ఎన్నో సార్లు షూటింగ్ పోస్ట్ పోన్ అవుతు వస్తుంది. మొన్న దీపావళి కి కూడా ఒక సాంగ్ రిలీజ్ చేస్తామని ప్రకటించిన మేకర్స్ సాంకేతిక కారణాల వల్ల అది కూడా చెయ్యలేక పోయారు. ఇప్పుడు మూవీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అయ్యేది అనే అప్ డేట్ ని కూడా చిత్ర యూనిట్ ఇవ్వడం లేదు. దీంతో చరణ్ అభిమానులు చాలా డల్ గా ఉన్నారు. చరణ్ అయినా కల్పించుకొని మూవీ అప్ డేట్స్ బయటికి వచ్చేలా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.కాగా ఇండస్ట్రీ వర్గాల్లో వచ్చే నెల ఫిబ్రవరి కి గేమ్ చేంజర్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంటాడనే మాటలు వినిపిస్తున్నాయి.

పొలిటికల్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే టాక్ అయితే బయట చాలా బలంగా వినపడుతుంది.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు .కియారా అద్వానీ చరణ్ కి జోడిగా నటిస్తుంది.

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.